ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈహెచ్‌ఎస్‌ అమలయ్యేనా?

ABN, First Publish Date - 2022-03-05T07:19:15+05:30

ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) అమలు కోసం ఉద్యోగులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏడాదిగా పడకేసిన ఆరోగ్య పథకం
  • 2% కాంట్రిబ్యూషన్‌ ఇస్తాం
  • ప్రభుత్వానికి టీఎన్జీవో సూచన
  • బడ్జెట్‌లో నిధులివ్వాలని విజ్ఞప్తి


హైదరాబాద్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) అమలు కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఈసారి కొత్త బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి, అమలు చేయాలని కోరుతున్నారు. నిజానికి ఏడాది కాలంగా ఈహెచ్‌ఎస్‌  పడకేసింది. వైద్య సేవల కోసం వెళ్లే ఉద్యోగులు, పెన్షనర్లకు  వైద్య సేవలను  అందించడానికి ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ రీయింబర్స్‌మెంట్‌ స్కీం కింద ఉద్యోగులు వైద్య సేవలు పొందుతున్నారు.  రీయింబర్స్‌మెంట్‌కు రూ.2 లక్షల వరకే పరిమితి ఉందని, అంతకంటే ఎక్కువ ఖరీదైన వైద్య సేవలను పొందలేకపోతున్నామని వాపోతున్నారు.


అందుకే ఈ బడ్జెట్‌లో ఈహెచ్‌ఎ్‌సకు నిధులు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీనికి తమ వంతుగా ఉద్యోగ చందా(ఎంప్లాయి కాంట్రిబ్యూషన్‌)ను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి వివరించాయి. ఈ స్కీమ్‌ను మళ్లీ ప్రారంభించాలని కోరుతున్నామని చెబుతున్నాయి. ఇదివరకు ఈహెచ్‌ఎస్‌ కింద ఉద్యోగులకు అందించిన సేవలకు సంబంధించి రూ.350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఆస్పత్రులకు వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లను తిరస్కరిస్తున్నాయి. 


చందా ఇవ్వడానికి సిద్ధమైన ఉద్యోగులు...

ఈహెచ్‌ఎ్‌సను పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో కొనసాగించడం వల్ల కొన్ని రకాల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈహెచ్‌ఎస్‌ కింద డబ్బు ఇవ్వడాన్ని నిలిపివేసింది. పూర్తిగా ప్రభుత్వ సొమ్ముతో కాకుండా ఉద్యోగుల చందా కూడా ఉంటే... చికిత్స చేయించుకునే ఉద్యోగులకు బాధ్యత ఉంటుందని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.


ఇందుకుగాను ప్రతి నెలా మూల వేతనంలో 2ు సొమ్మును చందాగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎన్‌జీవోల సంఘం ప్రకటించింది. టీజీవోల సంఘం ఒక్క శాతం ఇస్తామని చెప్పింది. పెన్షనర్లు కూడా ఒక్క శాతం సొమ్మును ఇవ్వనున్నారు. అందరి నుంచి 2ు చొప్పున వసూలు చేస్తే ఏడాదికి రూ.840 కోట్లు అవుతాయని, అదే 1ు చొప్పున కట్‌ చేస్తే ఏడాదికి రూ.420 కోట్లు జమ అవుతాయని సంఘాలు వివరిస్తున్నాయి. అందరి సమ్మతితో ఒకటిన్నర శాతం చొప్పున కట్‌ చేసినా... రూ.630 కోట్లు జమ అవుతాయని చెబుతున్నాయి. ఉద్యోగుల నుంచి వసూలైన సొమ్ముకు సమానమైన సొమ్మును ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


దీనిని ఈహెచ్‌ఎస్‌ ట్రస్టు అకౌంట్‌లో జమ చేయాలని, ట్రస్టుకు సీఈవోగా ఐఏఎ్‌సను, ఉద్యోగ సంఘాల నుంచి సభ్యులను నియమించాలని కోరుతున్నాయి. టీజీవోలు, టీఎన్‌జీవోల సంఘాలు ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును కలిసి వివరించాయి.  అందుకు మంత్రి సమ్మతించారని టీఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ వివరించారు. నిధులు కేటాయిస్తే కొత్త ఆర్థికసంవత్సరం నుంచి ఈహెచ్‌ఎస్‌ అమలయ్యే అవకాశాలుంటాయన్నారు. 


Updated Date - 2022-03-05T07:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising