ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ తగదు

ABN, First Publish Date - 2022-02-17T06:04:44+05:30

విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ తగదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి

- ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి 

జనగామ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించాలని చూడడం కేంద్రప్రభుత్వానికి తగదని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి.సంజీవరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల సంఘం-327 యూనియ న్‌ నూతన భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన యూనియన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించడం వల్ల రైతులకు, సంస్థ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. జిల్లాలో 327 యూనియన్‌ బలంగా ఉందని, మిగతా సంఘాల కంటే ఎక్కువ మొత్తంలో సభ్యత్వాలు చేయించడం అభినందనీయమన్నారు. అంతకుముందు సంజీవరెడ్డి 94వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ ఇనుగాల శ్రీధర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ మల్లిఖార్జున్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు నీలం ఐలేశ్‌, జిల్లా కార్యదర్శి సీహెచ్‌.నరేందర్‌రెడ్డి, డివిజన్‌ అధ్యక్షుడు జి.రవీందర్‌రెడ్డి, డివిజన్‌ కార్యదర్శి బాలు, జిల్లాలోని అన్ని మండలాల యూనియన్‌ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-17T06:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising