ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2022-07-07T09:55:54+05:30

ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. దీంతో సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 8వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చు. ఈ మేరకు బోర్డు పరీక్షల విభాగం కంట్రోలర్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లించే గడువు ఈ నెల 6తో ముగియగా.. దీన్ని మరో రెండు రోజులు పొడిగించారు. గత నెల 28న ఇంటర్‌ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెయిల్‌ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెల 1 నుంచి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు రీ-వాల్యుయేషన్‌ కోసం 21,120 మంది, రీ-కౌంటింగ్‌కు 4,787 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగిసింది. కాగా, ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో పనిచేస్తున్న 8 మంది జూనియర్‌ కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసును క్రమబద్ధీకరించారు. ఈ మేరకు బుధవారం  విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2022-07-07T09:55:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising