ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయం నా వైపే ఉంది.. ధీమాతో Inspector Nageswara Rao..!

ABN, First Publish Date - 2022-07-13T23:27:24+05:30

అత్యాచారం కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు (Inspector Nageswara Rao) చర్లపల్లి జైల్లో ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: అత్యాచారం కేసులో అరెస్టయిన ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు (Inspector Nageswara Rao) చర్లపల్లి జైల్లో ఉన్నారు. అత్యాచారం, కిడ్నాప్ కేసు (Kidnap case)లో అరెస్ట్ చేశారు. సోమవారం రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం జైలులో నాగేశ్వరరావు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మంగళవారం ఉదయం పోలీసులు అతణ్ని చర్లపల్లి జైలు (Cherlapally Jail)కు తరలించారు. జైలు అధికారులు అక్కడ అతణ్ని అత్యధిక భద్రత ఉన్న ఐసొలేటెడ్‌ సెల్‌లో ఉంచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. జైలు అధికారులు ఉదయం ఖైదీలతో మాట్లాడే సమయంలో నాగేశ్వరరావు తనను తాను పరిచయం చేసుకున్నాడు. న్యాయం తన వైపే ఉందని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటకొస్తాయని ధైర్యంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తనను కావాలనే ట్రాప్‌ చేసి, ఈ కేసులో ఇరికించారని.. తాను ఏ తప్పూ చేయలేదని నాగేశ్వరరావు జైలు అధికారులతో పేర్కొన్నట్లు తెలిసింది.


నాగేశ్వరరావు రిమాండ్‌ రిపోర్టు (Remand Report) ఎక్కడా బయటకు రాకుండా పోలీసులు గోప్యత పాటిస్తుండడం గమనార్హం. అయితే ఈ రోజు రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. రిమాండ్ రిపోర్టులో 17 మంది సాక్షుల వాంగ్మూలాలను  పోలీసులు సేకరించారు. అలాగే ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. సీఐ సర్వీస్‌ రివాల్వర్‌, పోలీస్‌ యూనిఫాం సేకరించారు. నాగేశ్వర్‌రావు సర్వీస్‌ రివాల్వర్‌తో బెదిరించి వివాహితపై అత్యాచారం, హత్యాయత్నం, కిడ్నాప్‌కు యత్నించాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. బాధితురాలి ఇంట్లోకి నాగేశ్వర్‌రావు బలవంతంగా చొరబడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నాగేశ్వరరావు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురంనకు చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, భర్తను రివాల్వర్‌తో బెదిరించారని.. వేధింపులకు గురిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులోని అంశాల ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులను పోలీసులు నమోదు చేశారు. అనంతరం నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.

Updated Date - 2022-07-13T23:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising