ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ts News: ఇంద్రకరణ్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్

ABN, First Publish Date - 2022-07-23T19:37:05+05:30

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy)కి సీఎం కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి (Indrakaran Reddy)కి సీఎం కేసీఆర్ (CM KCR) ఫోన్ చేశారు. భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District)లో వరద పరిస్థితిపై కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కేసీఆర్ సూచించారు. పది రోజుల పాటు కురుస్తున్న వర్షాలకు జిల్లా రైతాంగం చావు దెబ్బతింది. జిల్లాలో ప్రధాన పంటలన్నీ భారీ విస్తీర్ణంలో తుడిచి పెట్టుకపోయాయి. జిల్లావ్యాప్తంగా 50వేల ఎకరాలకుపైగా పత్తి పంట నీటి మునిగి మొక్కలు చనిపోగా మరో 12వేల ఎకరాల్లో కంది, ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది రైతులు (Farmers) ప్రభుత్వ చేయూత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే వర్షాలు కురియడంతో రైతాంగం కోటి ఆశలతో ఉత్సాహంగా పత్తి పంట సాగు చేపట్టింది. మొక్కలు మొలచి ఏపుగా పెరుగుతున్నాయనుకుంటున్న దశలో అతి వృష్టి కారణంగా రైతులు ఒక్కొక్క ఎకరాపై రూ.15వేలకుపైగా నష్ట పోయారు. ప్రస్తుతం మళ్లీ పంటలు నాటే పరిస్థితి కూడా లేదని రైతులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-23T19:37:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising