ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పబ్‌లో.. ఇద్దరికి వేధింపులు!

ABN, First Publish Date - 2022-06-07T08:17:00+05:30

‘‘పబ్‌లో పార్టీ ముగిశాక బయటికొచ్చిన బాలికను బేకరీకి తీసుకెళ్లారు.. అక్కడినుంచి తిరిగివస్తుండగా అత్యాచారానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పైఅంతస్తులోనే సాదుద్దీన్‌, కార్పొరేటర్‌ కుమారుడి వెకిలి చేష్టలు..

భరించలేక బయటకొచ్చేసిన బాలికలు

క్యాబ్‌లో ఒకరు ఇంటికి.. బేకరీకి వెళదామంటూ రెండో బాలికపై నిందితుల తీవ్ర ఒత్తిడి

బెంజ్‌లో వెళ్తుండగా అసభ్య ప్రవర్తన.. వీరిలో ఎమ్మెల్యే కొడుకు..

ఇంటికి బయల్దేరిన బాలికపై పథకం ప్రకారం రేప్‌

రిమాండ్‌ రిపోర్టులో మరిన్ని వాస్తవాలు బయటకు..

మరోసారి బాలిక వాగ్మూలం తీసుకున్న విచారణాధికారి

పోలీసుల ఎదుట హాజరు కాని మాజీ మేయర్‌..

పోక్సో కేసా? ఎఫ్‌ఐఆర్‌లో పేరా? ఎమ్మెల్యే కుమారుడిపై నేడు నిర్ణయం


బంజారాహిల్స్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘పబ్‌లో పార్టీ ముగిశాక బయటికొచ్చిన బాలికను బేకరీకి తీసుకెళ్లారు.. అక్కడినుంచి తిరిగివస్తుండగా అత్యాచారానికి పాల్పడ్డారు’’..! అత్యంత సంచలనం రేపుతున్న హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటి దాకా వినిపించిన వాదన ఇది. కానీ, దీనికిముందే అమ్నేషియా పబ్‌లోనే నిందితులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.


అది కూడా.. ఒకరు కాదు ఇద్దరు బాలికలపై..! వీరి దురాగతాలను భరించలేక, ఆ ఇద్దరు బాలికలు మూడో అంతస్తులోని పబ్‌ నుంచి కిందకు వచ్చేశారు. అయితే, ఒక బాలిక క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. రెండో బాలిక మాత్రం.. నిందితుల మాయమాటలను నమ్మి మోసపోయింది. సామూహిక అత్యాచారం నిందితులు.. ఇద్దరు బాలికలను వేధించిన సంగతితో పాటు ఇంతవరకు వెలుగులోకి రాని పలు విషయాలను పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పొందుపర్చారు. బాలికల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు అందులో పేర్కొన్నారు. రిమాండ్‌ రిపోర్టు ప్రకారం..


మొదట కార్పొరేటర్‌ కుమారుడు.. తర్వాత సాదుద్దీన్‌

మే 28న అమ్నేషియా పబ్‌కు వచ్చిన బాలికను మొ దట సంగారెడ్డికి చెందిన కార్పొరేటర్‌ కుమారుడు చూశా డు. ఆమెపట్ల కాస్త దురుసుగా వ్యవహరించాడు. దీన్నిచూసి సాదుద్దీన్‌ రెచ్చిపోయాడు. సామూహిక అత్యాచార బాధితురాలితో పాటు ఆమె పక్కనే ఉన్న మరో బాలిక ప ట్ల వీరిద్దరూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి అరాచకాలు భరించలేక బాలికలు కిందకు వచ్చారు. ఓ బాలిక క్యాబ్‌లో ఇంటికి వెళ్లిపోయింది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌ బెంజ్‌ కారులో పబ్‌కు చేరుకున్నాడు. బాధితురాలిని చూసి.. మాటలు కలిపేందుకు యత్నించాడు. ఈ లోగా సాదుద్దీన్‌, కార్పొరేటర్‌ కుమారుడు మరో ఆరుగురు కిందకు వచ్చారు. ఇంటి వద్ద దించుతామంటూ బాలికతో నమ్మబలికారు. ఆమె మొదట ఒప్పుకోకున్నా.. అందరూ ఒత్తిడి తేవడంతో అంగీకరించింది. బెంజ్‌లో ఉమేర్‌ఖాన్‌, ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్‌ కుమారుడితో పాటు మరో మైనర్‌, బాధిత బాలిక, ఇన్నోవాలో సాదుద్దీన్‌తో పా టు మిగతావారు ఎక్కారు. దారిలోనే బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే, ఈమధ్యలో బంజారాహిల్స్‌ రోడ్‌నం.14కు వెళ్లాక కాన్సు బేకరీలో కేక్‌లు బాగుంటాయని, తిన్నాక వెళ్దామని చెప్పారు. 


పథకం ప్రకారమే.. అత్యాచారం ఉద్దేశంతోనే

కేక్‌లు తిన్నాక బాలిక ఇంటికి బయల్దేరింది. కానీ అం దరూ వారించి మళ్లీ పబ్‌కు వెళ్దామని ఒప్పించారు. అంతకుముందే అందరూ కలిసి అత్యాచారం చేయాలని నిర్ణయించుకున్నారు. బెంజ్‌ కారు అనువుగా ఉండదని భావించారు. మొదట బాలికను బెంజ్‌లో ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వచ్చాక పెట్రోల్‌ అయిపోయిందని చెప్పి ఆమెను ఇన్నోవాలోకి ఎక్కించారు. ఈలోగా ఎమ్మెల్యే కు మారుడికి ఫోన్‌ రావడంతో కిందకు దిగిపోయాడు. సాదుద్దీన్‌, ఉమేర్‌ఖాన్‌తో పాటు ముగ్గురు మైనర్లు.. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశారు. ఆమెను పబ్‌ వద్ద దించేసి తిరిగి కాన్సు బేకరీ చేరుకుని సంబరాలు జరుపుకొన్నారు. సెల్ఫీ దిగి సోషల్‌ మీడియా లో పోస్టు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. గత నెల 31న బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించినట్లు తెలియడం తో విడివిడిగా పారిపోయారు. కొందరు సెల్‌ఫోన్‌ స్వి చ్చాఫ్‌ చేశారు. మరికొందరు తమ సెల్‌లో వేరే సిమ్‌ వేసి ఇతరులకు ఇచ్చి వేరే రాష్ట్రాలకు పంపించారు. కాగా, సామూహిక అత్యాచారం కేసులో ఇప్పటివరకు పోలీసులు సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు మైనర్లను అరెస్టు చేశారు. ఉమేర్‌ ఖాన్‌ కోసం గాలిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారని సమాచారం.


మరోసారి బాలిక వాగ్మూలం సేకరణ

సోషల్‌ మీడియాలో బాధిత బాలికతో ఎమ్మెల్యే కుమారుడు కూడా అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రత్యక్షమయ్యాయి. అతడి ప్రమేయం ఏ మేరకు ఉంది? అని తెలుసుకునేందుకు విచారణాధికారి బంజారాహిల్స్‌ ఏసీసీ సు దర్శన్‌ తన సిబ్బందితో కలిసి మెజిస్ట్రేట్‌ స్థాయి అధికారి ఎదుట సోమవారం బాలిక వాగ్మూలాన్ని తీసుకున్నారు. ఎమ్మెల్యే కుమారుడు బెంజ్‌ కారులో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె తెలిపింది. దీంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తారా? లేదా ప్రస్తుతం సామూహి క అత్యాచారం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చుతారా? అనేది మంగళవారం తేలనుంది. సామూహిక అత్యాచారం ఎఫ్‌ఐఆర్‌లో ఏ-6గా ఎమ్మెల్యే కుమారుడి పేరు చేరుస్తారని సమాచా రం ఇదిలా ఉండగా మరిన్ని ఆధారాల కోసం క్లూ టీం రెండో రోజూ బెంజ్‌, ఇన్నోవాల్లో తనిఖీలు నిర్వహించింది. ఇక టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం అమ్నేషియా పబ్‌ నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లోని కాన్సు బేకరీ వరకు, తిరిగి పబ్‌ వరకు పలుసార్లు పరిశీలించింది.  


అటుగా వెళ్తున్నవారే సాక్షులు

అత్యాచారం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న కొందరిని సీసీ పుటేజీ ద్వారా గుర్తించి వారిలో ముగ్గురిని విచారించారు. వీరినే సాక్షులుగా చేర్చే పనిలో ఉన్నారు. విచారణకు హాజరుకావాలని మాజీ మేయర్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం హాజరుకావాలని పేర్కొన్నా ఆయన రాలేదు. బహుశా నోటీసులు అందకపోవచ్చని పోలీసులు చెప్పారు.


బాలిక వీడియోలు, ఫొటోలు వైరల్‌ చేసినవారిపై చర్యలు

కొందరికి ప్రశ్నలు.. మరికొందరికి నోటీసులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): పబ్‌ వద్ద నుంచి బాలికను తీసుకెళ్లడానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ కావడాన్ని పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. కొంతమంది వాటి ఆధారంగా పోలీసుల చర్యలపై విమర్శలు గుప్పిస్తుండగా.. మరికొందరు ఆ వీడియో లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ విషయంలో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇప్పటికే పలువురిపై చర్యలు ప్రారంభించారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరికొందరికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు కొంతమందికి నోటీసులిచ్చారు. ఎక్కడెక్కడ ఎవరెవరు వీడియోలు వైరల్‌ చేశారు? అని దర్యాప్తు చేస్తున్నారు. వారిపైనా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-06-07T08:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising