ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో.. నేటి నుంచి ‘హెల్త్‌ ప్రొఫైల్‌’

ABN, First Publish Date - 2022-03-05T06:29:04+05:30

ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు 


సిరిసిల్ల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసి, డిజిటల్‌ కార్డులు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ‘హెల్త్‌ ప్రొఫైల్‌’ కార్యక్రమం ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. దీన్ని శనివారం రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆస్పత్రిలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ములుగు జిల్లా కేంద్రంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.


ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 220, ములుగు జిల్లాలో 153 బృందాలు ఇంటింటి సర్వే చేపట్టనున్నాయి. ప్రతి బృందంలో ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బంది ఉంటారు. ఈ బృందాలను ఆయా మండలాల వైద్యాధికారులు పర్యవేక్షిస్తారు. బుధ, శని, ఆదివారాల్లో నమూనాల సేకరణకు మినహాయింపు ఉంటుంది. మూడు నెలల్లో ఈ రెండు జిల్లాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ పూర్తి చేయనున్నారు. 

Updated Date - 2022-03-05T06:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising