ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

108 అంబులెన్సుల్లో ఈసీజీ సౌకర్యం

ABN, First Publish Date - 2022-05-16T08:40:47+05:30

గుండెనొప్పితో బాధపడే పేదలకు అత్యవసర వైద్య చికిత్స వేగంగా అందించేందుకు 108 అంబులెన్స్‌ వాహనాల్లో ఈసీజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేటలో పైలట్‌ ప్రాజెక్ట్‌

సిద్దిపేట, గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రుల్లో విజయవంతంగా స్టెమీ ప్రాజెక్టు

థ్రోంబోలైసిస్‌ పరికరంతో అత్యవసర చికిత్స

సిద్దిపేట టౌన్‌, మే 15: గుండెనొప్పితో బాధపడే పేదలకు అత్యవసర వైద్య చికిత్స వేగంగా అందించేందుకు 108 అంబులెన్స్‌ వాహనాల్లో ఈసీజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటను పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేశారు. గుండె సంబంధిత రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు నాలుగేళ్ల క్రితం ‘స్టెమీ ప్రాజెక్టు’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కింద సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని రెండు ఐసీయూలు, గజ్వేల్‌లోని జిల్లా ఆస్పత్రిలో ఒక ఐసీయూలో విజయవంతంగా చికిత్స అందిస్తున్నారు. అవసరమైన వారికి థ్రోంబోలైసిస్‌ ప్రక్రియ ద్వారా వైద్యం అందించి పునర్జన్మ ఇచ్చారు.


సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,241 మందికి ఈసీజీ తీయగా 22 మందికి థ్రోంబోలైసిస్‌ ప్రక్రియ ద్వారా వైద్యం అందించారు. అలాగే గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రిలో 1,032 మందికి ఈసీజీ తీయగా 14 మందికి థ్రోంబోలైసిస్‌ ప్రక్రియ ద్వారా వైద్యం అందించి కాపాడారు. గుండెపోటు వచ్చిన వారికి గోల్డెన్‌ అవర్‌లో చికిత్స అందించడం కీలకం. గంటలోపు వారికి సరైన చికిత్స అందిస్తే, రక్షించడం సులభమవుతుంది. దీనిని పరిగణనలోకి తీసుకుని 108 అంబులెన్స్‌ల్లో ఈసీజీ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారు చనిపోవడానికి ప్రధాన కారణం బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తగిన సమయం ఉండకపోవడం, రవాణా సదుపాయాలు లేకపోవడం. అంతేకాకుండా ప్రాథమిక స్థాయి ఆస్పత్రుల్లో తీవ్రమైన గుండెపోటును గుర్తించే పరిస్థితి ఉండకపోవడమేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 108 అత్యవసర అంబులెన్సులున్నా వాటిలో ఈసీజీ సదుపాయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాల రేటు అధికంగా ఉందని వైద్య మంత్రి హరీశ్‌రావు గ్రహించి, ఈ పరిస్థితికి అధిగమించాలని భావించారు. ఇందుకోసం ప్రత్యేకంగా 108 అంబులెన్స్‌లలో ఈసీజీ మిషనరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు, అధికారులు స్టెమీ సేవలలో భాగంగా 108 అంబులెన్స్‌లో ఈసీజీ సౌకర్యం అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందించారు. గుండెనొప్పి బాధితుల కోసం త్వరలోనే అంబులెన్సుల్లో ఈసీజీతో స్టెమీ అనుసంధానం కానుంది. 

Updated Date - 2022-05-16T08:40:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising