ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ వ్యాప్తంగా దళితబంధును అమలు చేయించండి

ABN, First Publish Date - 2022-01-24T09:04:14+05:30

బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ ఎంపీలకు మంత్రి హరీశ్‌రావు సవాల్‌

సంగారెడ్డి టౌన్‌, జనవరి 23: బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేయించాలని   ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. దళితబంధు అమలుపై  సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితబంధును అమలుచేసి తీరతామని   స్పష్టం చేశారు. దళితబంధు, మన ఊరు మన బడి అమలును జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. దళితబంధును దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టాలని బీజేపీని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌కి దమ్ముంటే కేంద్రం నుంచి నవోదయ విద్యాలయాలను, గిరిజన వర్సిటీ, మైనింగ్‌ యూనివర్సిటీలను తీసుకు రావాలన్నారు. పోటీ పరీక్షలు కేవలం హిందీలో కాకుండా ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అనేకసార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన లేదని, బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించాలని సూచించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఆదివారం చేపట్టిన జ్వరసర్వేలో మంత్రి పాల్గొని పరిశీలించారు.  మరో ఐదు రోజుల్లో జ్వరసర్వేను పూర్తి చేస్తామన్నారు. 

Updated Date - 2022-01-24T09:04:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising