ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాన్సర్‌ నిరోధక రసాయనం అభివృద్ధిలో ఐఐసీటీ సహకారం

ABN, First Publish Date - 2022-10-14T09:18:52+05:30

క్యాన్సర్‌, మైగ్రేన్‌, పార్కిన్‌సన్‌ సహా పలు వ్యాధులను నిరోధించే ఔషధాల తయారీలో కీలకమైన హైడ్రజిన్‌ హైడ్రేట్‌(హెచ్‌6ఎన్‌2ఓ) రసాయనం అభివృద్ధిలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలకపాత్ర పోషించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేఏసీఎల్‌తో కలిసి పని చేసిన హైదరాబాద్‌ సంస్థ 


హైదరాబాద్‌, అక్టోబరు 13: క్యాన్సర్‌, మైగ్రేన్‌, పార్కిన్‌సన్‌ సహా పలు వ్యాధులను నిరోధించే ఔషధాల తయారీలో కీలకమైన హైడ్రజిన్‌ హైడ్రేట్‌(హెచ్‌6ఎన్‌2ఓ) రసాయనం అభివృద్ధిలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) కీలకపాత్ర పోషించింది. గుజరాత్‌ ఆల్కలీస్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెట్‌(జీఏసీఎల్‌)తో కలిసి ఐఐసీటీ శాస్త్రవేత్తలు ఈ రసాయనాన్ని అభివృద్ధి చేశారు. తమ కృషి ఫలితంగా హైడ్రజిన్‌ హైడ్రేట్‌ను ఇకపై స్వదేశంలోనే తయారు చేసుకోవచ్చునని, ఈ రసాయన దిగుమతి భారం 60 శాతం మేర తగ్గుతుందని ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. గుజరాత్‌లోని జీఏసీఎల్‌లో ఉన్న హైడ్రజిన్‌ హైడ్రేట్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గత సోమవారం జాతికి అంకితం చేశారని వివరించారు.  

Updated Date - 2022-10-14T09:18:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising