ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరి వేస్తే ఉరే అంటివి... రైతులతో రాజకీయం జేస్తివి

ABN, First Publish Date - 2022-04-16T08:43:49+05:30

‘యాసంగిలో వరి వేయొద్దన్నావు.. వరి వేస్తే ఉరే అన్నావు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ  ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు

మల్లాపూర్‌, ఏప్రిల్‌ 15 : ‘యాసంగిలో వరి వేయొద్దన్నావు.. వరి వేస్తే ఉరే అన్నావు..వేస్తే ధాన్యం కొనలేమని చెప్పడంతో సాగు చేయకుండా ఉన్నాము. ఇప్పుడేమో పండించిన ప్రతి గింజ కొంటామంటూ ప్రకటన చేస్తివి.. నీ మాటలు నమ్మి వరి సాగు చేయని రైతులతో రాజకీయం చేస్తివి’.. అంటూ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవుపేట గ్రామానికి చెందిన సుద్దు సురేందర్‌ అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశాడు. వరి వేస్తే పంట కొనలేము అని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ రావడంతో సురేందర్‌ తనకున్న ఎనిమిది ఎకరాల భూమిని అలానే వదిలేసాడు. తన లాగా వరి సాగు చేయని రైతుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా డు. రైతులందరినీ ఆగం చేసి ఇప్పుడు ప్రతి గింజా కొంటామంటూ ప్రకటన చేసి రైతులతో రాజకీయాలా అంటూ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు స్వంత గ్రామైన రాఘవపేటలో రైతు ఫ్లెక్ష్సీ ఏర్పాటు చేయడం జిల్లాలో చర్చంశంగా మారింది. 

Updated Date - 2022-04-16T08:43:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising