ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలుకెళ్లొచ్చిన వ్యక్తి కింద పని చేయలేను

ABN, First Publish Date - 2022-08-05T08:54:26+05:30

‘‘ఓ ప్రజాప్రతినిధిగా చేయకూడని పని చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో కలిసి పని చేయలేను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మిమ్మల్ని విమర్శించినవారికి బాధ్యతలివ్వడం బాధించింది
  • ఎమ్మెల్యే పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా
  • కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లేఖ

నల్లగొండ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘ఓ ప్రజాప్రతినిధిగా చేయకూడని పని చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో కలిసి పని చేయలేను. కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణ విముక్తికి మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నమ్ముతూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’’ అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. గురువారం సాయంత్రం ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ‘‘సుశిక్షితుడైన కార్యకర్తగా, ప్రజాప్రతినిఽధిగా 30ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీలో మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా ఎక్కడా రాజీపడకుండా కష్టాలు, కన్నీళ్లు దిగమింగుకుంటూ పార్టీ ప్రతిష్ఠ కోసం, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రస్థానం సాగించాను. కానీ, కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానిస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులు, మీపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఇప్పటికే అనేక పార్టీలు మారి, స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధిగా చేయకూడని పనులు చేసి జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో నేను  పని చేయలేను. తెలంగాణ అంటేనే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అన్న విషయం మీకు తెలియనది కాదు. 60 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు వందలమంది బలిదానాలు చేసిన విషయం మీకు తెలిసిందే. అందరి చొరవతో సాకారమైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయింది. దాన్నుంచి విడిపించేందుకు మరో ప్రజాస్వామిక పోరాటం అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. అనేక జిల్లాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించలేని.., విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో మనోధైర్యం నింపి పోరాట కార్యాచరణ రూపొందించలేని వ్యక్తులు కాంగ్రెస్‌ పార్టీని నిర్వీర్యం చేశారు. అందుకే సబ్బండ వర్గాలు కోరుకున్న ప్రజా తెలంగాణలో, ప్రజాస్వామిక పాలన అందించే దిశగా మరో రాజకీయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకున్నా. ఈ దృష్ట్యా కాంగ్రెస్‌ పార్టీ ద్వారా గెలిచిన ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. దయచేసి ఆమోదించగలరు’ అని సోనియాకు రాసిన లేఖలో రాజగోపాల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-08-05T08:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising