ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ బిల్లు పేరు మార్పునకు తప్పని తిప్పలు..

ABN, First Publish Date - 2022-10-24T12:00:08+05:30

గ్రేటర్‌ జోన్‌లోని పలు సర్కిళ్లలో విద్యుత్‌ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపులో వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినా పట్టించుకోని అధికారులు

సీఎండీ ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో అమలు చేయని సిబ్బంది

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ జోన్‌లోని పలు సర్కిళ్లలో విద్యుత్‌ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపులో వినియోగదారులు నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఉన్న విధానంతో వస్తున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిబంధనలను సరళతరం చేసినా ఏమాత్రం లక్ష్యం నెరవేరడం లేదు.

మహానగరంలో 56 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా 20 వేలకు పైగా కొత్త కనెక్షన్లు వస్తుండగా, విద్యుత్‌ బిల్లుల యాజమాన్య హక్కులో పేరు మార్చుకునేందుకు 2-3 వేల దరఖాస్తులు వస్తుంటాయి. గతంలో విద్యుత్‌బిల్లులో పేరు మార్చుకోవాలంటే 9 రకాల డాక్యుమెంట్లు సమర్పించాల్సి వచ్చేది. వినియోగదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి టైటిల్‌ ట్రాన్స్‌ఫర్‌కు డాక్యుమెంట్లను కుదిస్తూ 2022 మార్చిలో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 9 రకాల డాక్యుమెంట్ల స్థానంలో బిల్లులో పేరు మార్చుకోవాలంటే టీఎ్‌సఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో ఐడీ ఫ్రూఫ్‌, ఇండిమ్నెటీ బాండ్‌, ఓనర్‌షిప్‌ డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేస్తే పేరు మార్చుకునేలా మార్పులు తెచ్చారు. అయితే, ఆన్‌లైన్‌లో పేరుమార్పునకు వస్తున్న దరఖాస్తులను పలు డివిజన్లలో కొంతమంది అధికారులు అసలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యుత్‌ అధికారులు, సిబ్బందిని కలిసి నేరుగా దరఖాస్తులివ్వడంతో పాటు రూ. 2-3 వేలు ముట్టజెబితే తప్ప పేరు మార్చుకునే పరిస్థితులు లేవని వినియోగదారులు ఆరోపిస్తున్నాయి. సీఎండీ జారీచేసిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అమలుచేయక పోవడంతో విద్యుత్‌బిల్లులో పేరు మార్చుకునేందుకు వినియోగదారులు మధ్యవర్తులను అశ్రయిస్తున్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించే దిశగా డిస్కం పలు మార్పులు తెస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు వాటివైపు కన్నెత్తి చూడకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు.

Updated Date - 2022-10-24T12:00:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising