ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్: MP Santhosh Kumar

ABN, First Publish Date - 2022-05-29T23:51:00+05:30

Hyderabad: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం’ సంయుక్తంగా హైదరాబాద్‌ శిల్పారామంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ - మట్టి కోసం మనం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం’ సంయుక్తంగా హైదరాబాద్‌ శిల్పారామంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్  - మట్టి కోసం మనం’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్లుగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తోందని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే  గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించామని చెప్పారు. మట్టి  కోసం మనం కార్యక్రమంలో భాగంగా ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ సద్గురు దేశంలోని 9 రాష్ట్రాల్లో బైక్ రైడ్‌ను కొనసాగిస్తారని, హైదరాబాద్‌కు జూన్ 15వ తేదీన  వస్తారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల, రమ్య బెహ్రా, సాహితీ చాగంటి, శ్రీ లలిత సందీప్‌ పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు, ఆర్గానిక్ రైతు నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T23:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising