ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కా ప్రణాళికతో ‘కంటి వెలుగు’

ABN, First Publish Date - 2022-12-07T03:38:53+05:30

రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలను దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనవరి 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనవరి 18 నుంచి రెండో విడత కార్యక్రమం

100 పని దినాల్లో దీన్ని పూర్తి చేయాలి: హరీశ్‌

హైదరాబాద్‌, జగిత్యాల, ఆర్మూర్‌ టౌన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి ): రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలను దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనవరి 18 నుంచి ప్రారంభించనున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. మంగళవారం ఆయన జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభావవంతంగా నిర్వహించేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా 960 మంది వైద్యులను కొత్తగా నియమించనున్నట్లు తెలిపారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత ను 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యేలా అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్‌ 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. మంగళవారం నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు, గర్భిణులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - 2022-12-07T03:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising