ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిలను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు?

ABN, First Publish Date - 2022-12-15T03:12:49+05:30

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఎందుకు టార్గెట్‌ చే స్తున్నారని పోలీసులను హైకోర్టు బుధవారం ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబద్ధం చెప్పడం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే

ఆమె వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం తగదు

పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఎందుకు టార్గెట్‌ చే స్తున్నారని పోలీసులను హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. పాదయాత్రకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. తాను ఇంట్లో నుంచి బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ వైఎస్‌ షర్మిల హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం.. ‘ పిటిషనర్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉంటాయి. పిటిషనర్‌ రోజువారీ జీవితంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఆమెపై నిఘా ఎందుకు పెట్టారు. పిటిషనర్‌ ఇంటి ఎదుట బారికేడ్లు పెట్టడం అంటే ఒకరకంగా ఆమెను గృహనిర్భందం చేసినట్లే. బారికేడ్లు, వం దల మంది పోలీసులను తొలగించండి. పది మంది మహిళా పోలీసులు ఉంటే సరిపోతుంది ’ అని వ్యాఖ్యానించింది. దీనిపై హోంశాఖ జీపీ రూపేందర్‌ వాదనలు వి నిపిస్తూ.. పిటిషనర్‌ తన తండ్రి విగ్రహం వద్దకు వెళ్తానని అబద్ధాలు చెప్పి ప్రగతి భవన్‌కు ఆటు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లారని చెప్పారు.

రాజ్‌భవన్‌ వద్ద ప్రెస్‌మీట్‌ పెట్టి కోర్టు విధించిన షరతులకు విరుద్ధంగా రెచ్చగొట్టేలా మాట్లాడారని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం..‘ ఆమెపై షరతులు విధించింది పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టేలా మాట్లాడరాదని.. అంతే తప్ప మిగితా చోట్ల కాదు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. రాజకీయ నాయకులు అన్నాక రాజకీయాలు కాకపోతే ఏం మాట్లాడతారు. అబద్ధాలు చెప్పడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. ఆమె తన కోణంలో అది నిజమని భావించారు కా వొచ్చు. గౌరవనీయులైన గవర్నర్‌ పిటిషనర్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు అడ్డుకోవడానికి మనకేం అధికారం ఉంది. ఒకవేళ ఆమె షరతులు ఉల్లంఘించారని భావిస్తే బెయిల్‌ రద్దు పిటిషన్‌ వేసుకోండి.

రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు అమలు చేయకుండా విశ్వాసాన్ని ఉల్లంఘించినందుకు ఎన్ని కేసులు పె ట్టాలి ?’ అని వ్యాఖ్యానించింది. హోంశాఖ జీపీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌ రోడ్ల మీద ఎటువంటి అనుమతి లేకుండా రాజకీయ కార్యక్రమాలు చేపడతున్నార ని.. దాని వల్ల ట్రాఫిక్‌, శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ట్యాంక్‌బండ్‌ వద్ద అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేపట్టారని.. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్‌ వ్యక్తిగత స్వేచ్ఛలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని.. ఆమె కదలికలను నిరోధించరాదని స్పష్టం చేసింది. అయితే పిటిషనర్‌ ఏ రాజకీయ కార్యక్రమం తలపెట్టినా పోలీసుల అనుమతి తీసుకోవాలని.. బెయిల్‌ కండీషన్స్‌, ఇతర షరతులు పాటించాలని తెలిపింది. పిటిషనర్‌ ఏమైనా ఉల్లంఘనలు చేస్తే ఈ ఆదేశాల సవరణ కోరుతూ పోలీసులు హైకోర్టుకు రావచ్చని స్పష్టం చేసింది.

Updated Date - 2022-12-15T03:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising