ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HYD : Pubలో బాలికతో అసభ్య ప్రవర్తన కేసులో కొత్త విషయాలు.. CC Footageలో ఎమ్మెల్యే కుమారుడు.. అసలేం జరిగింది..?

ABN, First Publish Date - 2022-06-03T15:31:24+05:30

పబ్‌లో మైనర్‌ పార్టీ.. (Pub) అక్కడే ఓ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : పబ్‌లో మైనర్‌ పార్టీ.. (Pub) అక్కడే ఓ బాలిక పట్ల అసభ్య ప్రవర్తన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన బాలిక(17) గత నెల 28న జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్‌లో జరిగిన పార్టీకి వెళ్లింది. కొద్దిసేపు ఉండి పబ్‌ నుంచి బయటకు వచ్చింది. స్నేహితులతో (Friends) కలిసి హిల్స్‌ రోడ్లపై తిరిగింది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి.. ఆమెతో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు (Jubliee Hills) ఫిర్యాదు చేశారు.


సూరజ్‌, హదీతోపాటు మరికొంతమందిపై పోక్సో కేసు నమోదు చేశారు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక పబ్‌ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను బెంజ్‌ కారులో (Benz Car) ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం.. కొద్ది సేపటి తరువాత ఇన్నోవా కారులో పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆమె వెళ్తున్న బెంజ్‌ కారులో పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు (MLA Son) ఉన్నాడని సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.


బాలిక తిరిగి వచ్చినప్పుడు ఇన్నోవాలో ఎమ్మెల్యే కుమారుడు లేడని నిర్ధారణ అయింది. కాన్సు బేకరీ వద్ద ఏం జరిగింది..? అనేది తేలాల్సి ఉంది. బాలిక చెబుతున్నట్లుగా కారులో ఐదుగురు ఉన్నట్టు నిర్ధారణ అయింది. వారు ఎవరనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌లో మైనర్లను పార్టీకి అనుమతించడంపై యాజమాన్యంపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పార్టీలో మద్యం సరఫరా జరిగిందా..? లేదా..? అనేది తేలాల్సి ఉంది.

Updated Date - 2022-06-03T15:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising