ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్‌ హై తో.. జీవన్‌ హై.. : ఉప రాష్ట్రపతి వెంకయ్య

ABN, First Publish Date - 2022-02-24T16:13:26+05:30

నదుల సంరక్షణ అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. కార్యక్రమంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్‌ : జల్‌ హై తో జీవన్‌ హై (నీరు ఉంటేనే జీవనం ఉంటుంది) అని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర జలశక్తి, పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖలు, యూనిసెఫ్‌, ఇతర సంస్థల భాగస్వామ్యంతో మూడు రోజుల పాటు నిర్వహించనున్న వాటర్‌, శానిటైజేషన్‌ అండ్‌ హైజీన్‌(వాష్‌) కాన్‌క్లేవ్‌ - 2022ను వర్చువల్‌గా బుధవారం ప్రారంభించారు. పంచాయతీల స్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, స్వచ్ఛత అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, బాల్యం నుంచే చిన్నారుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందేలా అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.


గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాష్‌లో పేర్కొన్న ప్రతీ అంశాన్ని ప్రతీ గడపకూ అందించాలన్నారు. నదుల సంరక్షణ అత్యంత కీలకమైన అంశమని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ జి.నరేంద్రకుమార్‌, యూనిసెఫ్‌ భారత దేశ ప్రతినిధి గిలియన్‌ మెల్సోఫ్‌, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ చంద్రశేఖర్‌ కుమార్‌, యూనిసెఫ్‌ వాష్‌ భారత దేశ ప్రతినిధి నికోలస్‌ ఓస్బర్డ్‌, యూనిసెఫ్‌ హైదరాబాద్‌ చీఫ్‌ మీతల్‌ రస్దీయా, కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎల్‌.కె అతీక్‌, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు చెందిన డాక్టర్‌ ఆర్‌.రమేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-02-24T16:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising