ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ సర్కారు చోద్యం చూస్తోంది: విజయశాంతి

ABN, First Publish Date - 2022-02-01T01:53:29+05:30

హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. 2018 ఎన్నికల నేపథ్యంలో రైతులకు లక్షరూపాయల లోపు ఉన్న అన్ని పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ 97 శాతం క్రాప్​ లోన్లు మాఫీ చేయకుండా వదిలేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర సర్కార్ రుణమాఫీ చేయకపోవడంతో తెలంగాణలో సుమారు 16 లక్షల మంది రైతులు డిఫాల్టర్లుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. గడువులోగా ఋణం చెల్లించక పోతే ఇళ్లకు తాళాలు వేస్తామని రైతులను బెదిరిస్తున్నారని,  చివరికి ఏం చేయాలో పాలుపోక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర సర్కార్ మాత్రం చోద్యం చూస్తోందని ఆమె విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కారుకు పరాభవం తప్పదని విజయశాంతి చెప్పారు. 


Vijayashanthi Senior BJP Leader



Updated Date - 2022-02-01T01:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising