ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్ పండిట్లపై దాడుల విషయంలో కేసీఆర్ మౌనానికి కారణం ఇదే: విజయశాంతి

ABN, First Publish Date - 2022-08-18T02:20:29+05:30

హైదరాబాద్: తెలంగాణ ప్రజల్ని వదిలేసి పక్క రాష్ట్రాల బాధితులకు సాయం చెయ్యడానికి పరుగులు తీసే ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ప్రజల్ని వదిలేసి పక్క రాష్ట్రాల బాధితులకు సాయం చెయ్యడానికి పరుగులు తీసే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు(Kalvakuntla Chandrashekar Rao) కశ్మీర్ పండిట్ల (kashmiri pandits) విషయంలో మౌనంగా ఉండటానికి హిందూ వ్యతిరేకతే కారణమని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) ఆరోపించారు. కశ్మీర్‌లో పండిట్లు, మైనార్టీ హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్నా కాంగ్రెస్, కమ్యూనిస్ట్, టీఆరెస్, దాని సయామీ కవల పార్టీ ఎంఐఎంల తీరు ఎప్పటిలాగే హిందూ వ్యతిరేకతకు అద్దం పట్టిందన్నారు. తాజాగా షోఫియాన్ జిల్లాలో కశ్మీరీ పండిట్ సోదరులు సునీల్, పింటూలపై జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో సునీల్ మరణించడం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్‌లో మైనార్టీ హిందూ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, చివరికి కూలీలను కూడా చంపుతూ దేశంలో కల్లోలం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తుంటే, దేశంలో హైందవేతరులెవరికి చీమకుట్టినా ఎంతో బాధతో స్పందించే ఈ పార్టీలు భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నాయని రాములమ్మ ఆరోపించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ అయితే... కశ్మీరులో ఆర్టికల్ 370 ఎత్తివేత వల్లే ఇలా జరుగుతోందంటూ భారత వ్యతిరేక దేశాలైన పాక్, చైనా, టర్కీల తీరుకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆమె చెప్పారు. కశ్మీరు ఉగ్రవాదుల ఆటలు కట్టించేందుకు కేంద్రం కృత నిశ్చయంతో ఉందని, విపక్షాలు మాత్రం ఓటు రాజకీయాలు చేస్తున్నాయని విజయశాంతి చెప్పారు. 



Updated Date - 2022-08-18T02:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising