ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabadలో కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయ్.. కిలో టమాట ఎంతంటే..!

ABN, First Publish Date - 2022-04-25T14:48:40+05:30

కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు అన్ని రకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతుబజార్‌లో కిలో టమాట రూ. 22, పచ్చిమిర్చి రూ.60
  • దిగిరానంటున్న కోడి మాంసం ధర

హైదరాబాద్‌ సిటీ : నగరంలో కూరగాయల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు అన్ని రకాల ధరలు అందుబాటులో ఉండగా, రెండు రోజుల నుంచి క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రైతుబజార్‌లో మొన్నటి వరకు రూ.8 నుంచి 12 వరకు పలికిన కిలో టమాట ప్రస్తుతం రూ.22కి చేరడంతో కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పాటు పచ్చిమిర్చి, క్యారట్‌ ధరలు సైతం పెరిగాయి. కాలనీలు, రోడ్ల వెంట తోపుడు బండ్ల వ్యాపారులు కిలో టమాటాను రూ.30కి విక్రయిస్తున్నారు.


అలాగే.. చికెన్‌ రేట్లు ఎంతకూ దిగి రాకపోవడంతో మాంసంప్రియులు అసంతృప్తికి లోనవుతున్నారు. 20 రోజుల క్రితం స్కిన్‌లెస్‌ కేజీ చికెన్‌ పలు చోట్ల రూ.240 నుంచి రూ.250 పలికింది. ఆదివారం లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, అత్తాపూర్‌లోని రిటైల్‌ దుకాణాల్లో కిలో రూ.260 నుంచి రూ.270కి విక్రయించారు. రంజాన్‌ పండుగ నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో కోడి మాంసం వినియోగిస్తుండడంతో వ్యాపారులు రేట్లు ఇష్టారాజ్యంగా పెంచి దండుకుంటున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.

Updated Date - 2022-04-25T14:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising