ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan reddy comments: 75ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రధాని నెరవేర్చారు

ABN, First Publish Date - 2022-09-17T16:07:33+05:30

75ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: 75ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ (PM Modi) నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ (Telangana Liberation Day) వేడుకల్లో కేంద్రమంత్రి (Union minister) పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సర్కార్ (Telangana government) అధికారికంగా జెండాను ఎగురవేయనుండటం ప్రజల విజయమన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కేసీఆర్ సర్కార్ (KCR government) జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహిస్తోందని అన్నారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు.. ఎనిమిది కోట్ల కళ్ళతో ఎదురుచూస్తోన్న రోజని తెలిపారు. 75 ఏళ్ళ తర్వాత సెప్టెంబర్ 17న తెలంగాణ గడ్డపై జాతీయ జెండాను కేంద్రమంత్రి అమిత్ షా (Amith shah) ఆవిష్కరించారని... అమరవీరులకు  నేడు నిజమైన శ్రద్ధాంజలని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.


విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో జైలుకు వెళ్ళామని గుర్తు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావులకు భారత ప్రభుత్వం (Indian government) తరుపున సెల్యూట్ చేశారు. ఆజాద్ కా అమృత మహోత్సం కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా విమోచనాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ (Congress), టీడీపీ (TDP), టీఆర్ఎస్‌ (TRS)లు అధికారికంలో ఉండగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదన్నారు. టైగర్ నరేంద్ర (Tiger Narendra), బద్దం బాల్ రెడ్డి(Baddam Bal Reddy), వీ.రామారావు (V. Rama Rao), బంగారు లక్ష్మణ్‌ (Bangaru Laxman)లు విమోచన దినోత్సవం కోసం పోరాటం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 

Updated Date - 2022-09-17T16:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising