ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan reddy: ఎంఐఎం బలోపేతానికే కేసీఆర్ కొత్త పార్టీ

ABN, First Publish Date - 2022-10-03T18:36:45+05:30

కేసీఆర్‌ను దేశంలో ఎవరూ నమ్మడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్‌ (KCR)ను దేశంలో ఎవరూ నమ్మడం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan reddy) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (BJP)ని ఓడిస్తానని ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ (Telangana CM) కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే ప్రధాని అయినట్లు.. కేటీఆర్ సీఎం అయినట్లు కల్వకుంట్ల కుటుంబం పగటికలలు కంటోందని యెద్దేవా చేశారు. దేశంలో కేసీఆర్‌ (TRS Chief)తో ఏ పార్టీ కలిసి రావడం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ (Kalvakuntla chandrashekar rao)తో ఏకీభవించలేదని అయన్ని కలిసిన నాయకులు చెబుతున్నారన్నారు. కేసీఆర్ (TS CM) ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే (TRS Leader) అర్థంకాక తలలు పట్టుకుంటున్నారని కేంద్రమంత్రి అన్నారు.


ఎంఐఎం(MIM)ను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ అని ఆరోపించారు. ప్రగతిభవన్‌కు అసదుద్దీన్‌ ఓవైసీ (Asaduddin Owaisi) బుల్లెట్ బండిపై నేరుగా వెళ్తారన్నారు. టీఆర్ఎస్‌ (TRS)కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ అని  వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మునుగోడులో భారీ మెజార్టీతో గెలుస్తామని కిషన్‌రెడ్డి (Union minister) ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-03T18:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising