ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు స్టువర్టుపురం దొంగల అరెస్టు

ABN, First Publish Date - 2022-07-11T16:39:34+05:30

అమీర్‌పేటలోని నగల దుకాణం ఎదుట పార్క్‌ చేసిన ద్విచక్రవాహనం డిక్కీలో నుంచి ఆభరణాలు దొంగిలించిన కేసులో ఇద్దరు స్టువర్టుపురం దొంగలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్విచక్ర వాహనం డిక్కీ నుంచి  ఆభరణాలు చోరీ  

రూ.9 లక్షల విలువ చేసే డైమండ్‌ నెక్లెస్‌ స్వాధీనం


హైదరాబాద్/పంజాగుట్ట: అమీర్‌పేటలోని నగల దుకాణం ఎదుట పార్క్‌ చేసిన ద్విచక్రవాహనం డిక్కీలో నుంచి ఆభరణాలు దొంగిలించిన కేసులో ఇద్దరు స్టువర్టుపురం దొంగలను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద 9 లక్షల రూపాయల విలువ చేసే డైమండ్‌ నెక్లె్‌సను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పంజాగుట్ట కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఏసీపీ పీవీ.గణేష్‌, డీఐ నరసింహరాజుతో కలిసి వివరాలు వెల్లడించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం స్టువర్టుపురం గ్రామానికి చెందిన ఎం.దుర్గాప్రసాద్‌ (40), ఐ.హరికృష్ణ (45) పాత నేరస్థులు. ఈ నెల 3న నగరానికి వచ్చిన వీరు సీబీఎస్‌ వద్ద అంజనీ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. నగల దుకాణాల వద్ద రెక్కీ నిర్వహించడానికి బయలుదేరారు. 4వ తేదీ మధ్యాహ్నం అమీర్‌పేటలోని పూజ జువెల్లర్స్‌ వద్ద కాపు కాశారు. అప్పుడే నగల దుకాణంలో నుంచి బయటికి వచ్చిన పుష్ఫ గోల్డ్‌, డైమండ్‌ జువెల్లర్స్‌లో పనిచేస్తున్న భరత్‌ దేవాసి ద్విచక్రవాహనం డిక్కీలో బ్యాగ్‌ పెట్టి పక్కకు వెళ్లడాన్ని గమనించారు. వాహనం డిక్కీ తెరిచి అందులోని ఆభరణాల బ్యాగు తీసుకుని వెళ్లిపోయారు. వాహనంలో బ్యాగు కనిపించకపోవడంతో భరత్‌ తమ సేల్స్‌ మేనేజర్‌ నికేత్‌ కొఠారికి చెప్పగా అతడు 5వ తేదీన పంజాగుట్ట పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దుర్గాప్రసాద్‌, హరికృష్ణ చోరీకి పాల్పడ్డట్టు గుర్తించారు. పాత నేరస్థుల చిట్టాను బయటికి తీసి వారి చిరునామా తెలుసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద డైమండ్‌ నెక్లె్‌సను స్వాధీనం చేసుకున్నారు. 5 బంగారుకోటెడ్‌ గడియారాలు దొరకలేదు. వాటిని కరిగించి విక్రయించినట్టు గుర్తించారు. సమావేశంలో డీఎ్‌సఐ నరేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-11T16:39:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising