ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధంతో నరకం.. గడియ ఒక గండంగా జీవించాం..!

ABN, First Publish Date - 2022-03-07T11:47:13+05:30

యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ నుంచి తమ కుమార్తె క్షేమంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉక్రెయిన్‌ నుంచి నగరానికి చేరుకున్న మెడిసిన్‌ విద్యార్థిని


హైదరాబాద్ సిటీ/కవాడిగూడ : యుద్ధం జరుగుతున్న వేళ ఉక్రెయిన్‌ నుంచి తమ కుమార్తె క్షేమంగా నగరానికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కుమార్తెను హత్తుకుని తల్లిదండ్రులు ఆనందభాష్పాలు రాల్చారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం పరిధి కవాడిగూడ డివిజన్‌ మారుతీనగర్‌కు చెందిన చెలిమల్ల సునీల్‌ ఏకైక కుమార్తె గ్రేసి మృధుభాషిణి ఉక్రెయిన్‌లోని జప్రోజియా పట్టణంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది.  ఆమె ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా మృధుభాషిణి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, యుద్ధంతో నరకం అనుభవించామని, గడియ ఒక గండంగా జీవనం సాగించామని తెలిపారు. ప్రాణాలతో స్వదేశానికి వెళ్తామా అనే సందేహం కలిగిందన్నారు. బంకర్లలో ఆరు నుంచి 12 గంటల వరకు అష్టకష్టాలు పడుతూ గడిపామని ఆమె చెప్పారు.


క్షేమంగా చేరుకున్న అనీల

బౌద్ధనగర్‌ : సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండికి చెందిన గడిపె అనీల ఉక్రెయిన్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. యుద్ధం సమయంలో కొన్నిరోజులు బంకర్‌లో తలదాచుకున్నామని అన్నారు. ఈనెల 3న 20 మందితో రైలు ప్రయాణం ద్వారా హంగేరికి చేరామన్నారు. అక్కడి నుంచి విమానంలో 5న ఢిల్లీకి, అక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం సమకూర్చిన విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నామని తెలిపారు.

Updated Date - 2022-03-07T11:47:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising