ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాయి : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-09-14T03:14:41+05:30

Hyderabad: శాసన సభ, శాసన మండలి వర్షా‌కాల సమావేశాలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. మూడు పని దినాల్లో అసెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: శాసన సభ, శాసన మండలి వర్షా‌కాల సమావేశాలు సజావుగా, ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. మూడు పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు  11 గంటల పాటు,   శాసన మండలి  సమావేశాలు 11 గంటల 42 నిమిషాల పాటు సాగాయన్నారు. సమావేశాల్లో రెండు తీర్మానాలు, ఎనిమిది బిల్లులకు సభ ఆమోదం తెలిపిందన్నారు. పేదలు, రైతులపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం తెబోతున్న విద్యుత్ చట్టం సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలన్న ఏకగ్రీవ తీర్మానాన్ని సభ స్వాగతించిందని తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని తీర్మానాన్ని ఆమోదించడం.. ఆ మహనీయుడి పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతోందని వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఇష్టానుసారంగా అమలు చేస్తున్న తీరును, ఏపీ పునర్విభజన  చట్టంలో పొందు పరిచిన హామీల అమలులో కేంద్రం వైఫల్యంపై  సభలో మంచి అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు.  సభా సంప్రదాయాలను ఎవరూ అగౌరవ పరిచినా, స్పీకర్‌ను కించపరిచినా ఊరుకునేది లేదన్నారు.  

Updated Date - 2022-09-14T03:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising