ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Filmnagar రోడ్డుకు ఎన్టీఆర్‌ మార్గ్‌గా నామకరణం చేయాలి..!

ABN, First Publish Date - 2022-05-29T14:42:12+05:30

ఫిలింనగర్‌ రోడ్డుకు ఎన్టీఆర్‌ మార్గ్‌గా నామకరణం చేయాలనే సినీ పరిశ్రమ డిమాండ్‌ను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : ఫిలింనగర్‌ రోడ్డుకు ఎన్టీఆర్‌ మార్గ్‌గా నామకరణం చేయాలనే సినీ పరిశ్రమ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్‌ కుమారుడు మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌ ఆవిష్కరించారు. అనంతరం సీనియర్‌ పాత్రికేయుడు భగీరథ రచించిన మహానాయుడు ఎన్టీఆర్‌ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.


రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. తమ బృందానికి పరుచూరి బ్రదర్స్‌ అని నామకరణం చేసింది కూడా ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-29T14:42:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising