ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనదారుల విలవిల

ABN, First Publish Date - 2022-04-27T14:23:39+05:30

ఓ పక్క ఎండ, మరో పక్క ట్రాఫిక్‌తో వాహనదారులు చుక్కలు చూశారు. సీఎం కేసీఆర్‌ మంగళవారం ఎర్రగడ్డ, గడ్డిఅన్నారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఓ వైపు ఎండ.. మరోవైపు ట్రాఫిక్‌

 సీఎం రాకతో పలు ప్రాంతాల్లో ఇక్కట్లు 


హైదరాబాద్‌ సిటీ/యూసుఫ్ గూడ: ఓ పక్క ఎండ, మరో పక్క ట్రాఫిక్‌తో వాహనదారులు చుక్కలు చూశారు. సీఎం కేసీఆర్‌  మంగళవారం ఎర్రగడ్డ, గడ్డిఅన్నారం, అల్వాల్‌  రైతు బజార్‌ ఎదురుగా టిమ్స్‌ ఆస్పత్రుల భవన నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. సీఎం రాకతో ఎర్రగడ్డ మార్గంలో ఉదయం వేళ భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి అల్వాల్‌కు వెళ్లే మార్గంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల సమయంలో రెండుసార్లు సీఎం కాన్వాయ్‌ రాకపోకలతో 15-20 నిమిషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపేశారు. అల్వాల్‌ రైతు బజార్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు వాహనాలపై భారీగా తరలివచ్చారు. దీని వల్ల కూడా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ఉదయం, మధ్యాహ్నం వేళలో ఎండ ఎక్కువగా ఉండడం, ఆ సమయంలో రోడ్లపై ఆగిపోవాల్సి రావడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు.


ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ జాంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు సెలవు రోజుల్లో పెట్టుకుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ ప్రధానరహదారి మార్గంలో నాలా పైప్‌లైన్‌ పనులతో ఒకవైపు రోడ్డు మూసేయడంతో ఈ రోడ్డులో ట్రాఫిక్‌ సమస్యలు మరింత పెరిగాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో పంజాగుట్ట ఏసీపీ గణేష్‌, వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌, ఎస్‌ఆర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-04-27T14:23:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising