ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని రాక సందర్భంగా..సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2022-05-25T17:45:05+05:30

ఐఎస్‎బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: ఐఎస్‎బీ (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌) ద్విదశాబ్ది ఉత్సవాలు, స్నాతకోత్సవ కార్యక్రమాలకు ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని, ఆయా మార్గాల గుండా ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్య స్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. 

 గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని బొటానికల్‌ గార్డెన్‌ వద్ద లెఫ్ట్‌ తీసుకొని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, మసీద్‌ బండ, మసీద్‌ బండ కమాన్‌, హెచ్‌సీయూ డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది. 

 లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్‌ తీసుకొని మసీద్‌ బండ కమాన్‌ వద్ద లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రి, బొటానికల్‌ గార్డెన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది. 

 విప్రో జంక్షన్‌ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్‌ వద్ద లెఫ్ట్‌ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్‌పల్లి ఎక్స్‌ రోడ్డులో రైట్‌ టర్న్‌ తీసుకొని హెచ్‌సీయూ బ్యాక్‌ గేట్‌ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.

 విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్‌ వద్ద రైట్‌ టర్న్‌ తీసుకొని ఫెయిర్‌ ఫీల్డ్‌ హోటల్‌, నానక్‌రామ్‌గూడ రోటరీ వద్ద లెఫ్ట్‌ టర్న్‌ తీసుకొని ఓఆర్‌ఆర్‌ రోడ్డు, ఎల్‌ అండ్‌ టీ టవర్స్‌ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు. 

 కేబుల్‌ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్‌ బ్రిడ్జి అప్‌రామ్‌ రోడ్డు నంబర్‌-45, మాదాపూర్‌ రత్నదీప్‌, మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌, సైబర్‌ టవర్స్‌, హైటెక్స్‌, కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు. 

Updated Date - 2022-05-25T17:45:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising