ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: ‘ఈబీఆర్‌టీఎస్‌’ అంతేనా..!

ABN, First Publish Date - 2022-12-07T12:04:32+05:30

ఐటీ కారిడార్‌లో ఇప్పట్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. వేలాది వాహనాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిపాదనలు రూపొందించినా మోక్షం కరువు

పనులపై ఆసక్తి చూపించని ప్రభుత్వం

ఈ ఏడాది బడ్జెట్‌లో రూపాయి లేదు..

తాజాగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌తో మరింత దూరం..

హైదరాబాద్‌ సిటీ: ఐటీ కారిడార్‌లో ఇప్పట్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గేలా కనిపించడం లేదు. వేలాది వాహనాలతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లాలో ఐటీ ఉద్యోగులతోపాటు సాధారణ ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎఎస్‌) పనులు మూలకు పడినట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మెట్రో రైలుకు సమాంతరంగా ఎలివేటెడ్‌ (ఆకాశమార్గంలో) ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పట్లో ఆ పనులకు మోక్షం కల్పించే పరిస్థితి కనిపించడం లేదు.

అందని ద్రాక్షేనా..?

రాయదుర్గం రహేజా మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో ఎయుర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో ఈబీఆర్‌టీఎస్‌ అందని ద్రాక్షగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలో పెరిగిన జనాభాతోపాటు వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో నగరం నలుమూలలా ట్రాఫిక్‌ తీవ్రత కనిపిస్తోంది. ప్రధానంగా ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, తదితర ప్రాంతాల్లో పలు సందర్భాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ పరిధిలో ట్రాఫిక్‌ చిక్కులను సులువుగా పరిష్కరించేందుకు కొవిడ్‌కు ముందు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఈబీఆర్‌టీఎ్‌సను ప్రతిపాదించింది. మెట్రో రైలు తరహాలో ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపించి ఐటీ కారిడార్‌లో ప్రజా రవాణాను బలోపేతం చేస్తే బాగుంటుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.

రూ.2,800 కోట్ల అంచనా వ్యయం..

ఐటీ కంపెనీల పరిధిలో ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టును తక్కువ వ్యయంతో పూర్తి చేయవచ్చని భావించారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల వరకు 18 స్టేషన్లలో ఎలివేటెడ్‌ రూట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆయా ప్రాంతాల మీదుగా బస్సులను నడిపించేందుకు కావాల్సిన పిల్లర్లు, ట్రాక్‌, ఇతర అవసరాలకు కోసం రూ.2,800 కోట్లు ఖర్చవుతుందని అప్పట్లో అధికారులు అంచనాలు రూపొందించారు. డిటైల్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. అయితే, ఎయిర్‌పోర్టు కారిడార్‌ అంశం తెరపైకి రావడంతో ఈ విషయం వెనక్కు వెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రతిష్టాత్మకం అంటూనే..

నగరంలో ఈబీఆర్‌టీఎస్‌ వ్యవస్థ అత్యంత ప్రతిష్టాత్మకమని, విదేశాల్లో నిర్వహిస్తున్న ఈ వినూత్న రవాణాను హైదరాబాద్‌ నగరానికి కూడా పరిచయం చేయాల్సిన అవసరముందని చెబుతున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించకపోవడంతో ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు అంతో ఇంతో ఆశలు ఉన్నప్పటికీ.. తాజాగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో ఈబీఆర్‌టీఎ్‌సకు ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడంలేదు.

5 లక్షల మందికి ఊరట..

ఐటీ కారిడార్‌లో ఈబీఆర్‌టీఎ్‌సను అందుబాటులోకి తీసుకొస్తే దాదాపు 5 లక్షల మందికి ట్రాఫిక్‌ కష్టాల నుంచి ఊరట లభిస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాల కంటే గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌, నానక్‌రామ్‌ గూడలోనే ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు మెట్రో రైళ్లలోనే ప్రయాణిస్తూ విధులకు హాజరవుతుంటారు. మెట్రో రైళ్లకు అనుసంధానంగా ఈబీఆర్‌టీఎస్‌ ప్రజా రవాణాను అందుబాటులోకి తీసుకొస్తే రోడ్లపై ప్రయాణించకుండా నేరుగా మెట్రో స్టేషన్ల నుంచి ఎలక్ర్టిక్‌ బస్సుల ద్వారా కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈబీఆర్‌టీఎస్‌ అంటే..

ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎస్‌) అనేది బస్‌ బేస్డ్‌ పబ్లిక్‌ టాన్స్‌పోర్టు సిస్టం. ఎలివేటెడ్‌ మార్గంలో ఎలక్ర్టిక్‌ ట్రాక్‌పై బస్సులు నడుస్తాయి. ఒక్కో బస్సులో 50 మంది ప్రయాణించవచ్చు. మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా నడిపించడం ద్వారా ప్రయాణికులు కాలుష్యం బారిన పడకుండా, ట్రాఫిక్‌ కోరల్లో చిక్కుకుపోకుండా ఉండే అవకాశం ఉంది.

Updated Date - 2022-12-07T12:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising