ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైమింగ్స్‌ మార్చుకోండి.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

ABN, First Publish Date - 2022-04-26T11:40:36+05:30

టైమింగ్స్‌ మార్చుకోండి.. రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ : టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. 27 ఉదయం 8 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.  కొత్తగూడ టు హైటె క్స్‌, సైబర్‌ టవర్స్‌ టు ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టు కొత్తగూడలో ఉన్న ఐటీ కంపెనీలు తమ టైమింగ్స్‌లో కొద్దిగా మార్పులు చేసుకోవాలని సూచించారు.  భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు.


డైవర్షన్‌

- నీరూస్‌ నుంచి గచ్చిబౌలి మీదుగా వచ్చే వాహనదారులు సైబర్‌ టవర్స్‌ వైపు వెళ్లకుండా, సీఓడీ వద్ద డైవర్సన్‌ తీసుకొని  దుర్గం చెరువు, ఇనార్బిట్‌, ఐటీసీ కోహినూర్‌, ఐకియా, బయోడైవర్సిటీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

- మియాపూర్‌, కొత్తగూడ, హఫీజ్‌పేట నుంచి హైటెక్‌ సిటీ మీదుగా వెళ్లే వాహనదారులు సైబర్‌ టవర్స్‌, జూబ్లీహిల్స్‌, ఏఐజీ హాస్పిటల్‌, దుర్గం చెరువు ఇనార్బిట్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

- ఆర్‌సీపురం, చందానగర్‌ నుంచి మదాపూర్‌, గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనదారులు.. ఆల్విన్‌ చౌరస్తా, కొండాపూర్‌ వైపు వెళ్లకుండా బీహెచ్‌ఈఎల్‌, నల్లగండ్ల, హెచ్‌సీయూ, ఐఐటీ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

Updated Date - 2022-04-26T11:40:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising