ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు నుమాయిష్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-31T23:59:22+05:30

82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) 2023ను ఆదివారం సాయంత్రం 5గంటలకు ఎగ్జిబిషన్‌ మైదానంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్జల్‌గంజ్‌, డిసెంబర్‌ 31(ఆంధ్రజ్యోతి): 82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్‌) 2023ను ఆదివారం సాయంత్రం 5గంటలకు ఎగ్జిబిషన్‌ మైదానంలో మంత్రులు మహమూద్‌ అలీ, ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సొసైటీ ఉపాధ్యక్షులు ఆశ్విని మార్గం, సెక్రటరీ సాయినాథ్‌ దయాకర్‌ శాస్ర్తి, జాయింట్‌ సెక్రటరీ సురేందర్‌, పబ్లిక్‌సిటీ చైర్మన్‌ హరినాథ్‌ రెడ్డి, కన్వీనర్‌ ధీరజ్‌ జైశ్వాల్‌, కన్వీనర్‌ ఆదిత్య మార్గం, అశోక్‌ హైదర్‌ తెలిపారు. మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

218 ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 31(ఆంధ్రజ్యోతి): నుమాయి్‌షకు గ్రేటర్‌లోని పలు ప్రాంతాల నుంచి 218 ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ ఈ.యాదగిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1 నుంచి 12వ తేదీ వరకు 111బస్సులు ఆ తర్వాత నుంచి ఫిబ్రవరి 15 వరకు 218 బస్సులను నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ పరిసరాలకు నడుపుతామన్నారు. ప్రత్యేక బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణకోసం చార్మినార్‌ డీవీఎం- 99592 26129, 8008 99635ను ఇన్‌చార్జిగా నియమించినట్టు తెలిపారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వరకు నుమాయి్‌షకు వచ్చే సందర్శకుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు

నుమాయిష్‌ ప్రారంభం సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు జనవరి 1 నుంచి నుమాయిష్‌ ముగిసే వరకూ ఉంటాయని తెలిపారు. సిద్దిఅంబర్‌బజార్‌, జాంబాగ్‌ వైపు నుంచి నాంపల్లి వైపునకు వచ్చే బస్సులు, ప్రైవేటు బస్సులను ఎంజేమార్కెట్‌, ఆబిడ్స్‌ వైపునకు పంపుతారు. పోలీస్‌ కంట్రోల్‌ రూం వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, బస్సులను ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, బీజేఆర్‌ విగ్రహం మీదుగా ఆబిడ్స్‌ వైపునకు పంపుతారు. బేగంబజార్‌ ఛత్రీ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు, గూడ్స్‌ వాహనాలను అలస్కా జంక్షన్‌ నుంచి దారుసలాం, ఏక్‌మినార్‌ వైపునకు పంపుతారు. దారుసలాం, మూసాబౌలి నుంచి బేగంబజార్‌ వైపునకు వెళ్లే భారీ వాహనాలు, డీసీఎంలను బేగంబజార్‌, సిటీకాలేజ్‌, నయాపూల్‌ వైపునకు మళ్లిస్తారు.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక బస్సులు

కార్వాన్‌, డిసెంబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా మెహిదీపట్నం నుంచి చిలుకూరి బాలాజీ టెంపుల్‌కు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు డిపో మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు. మెహిదీపట్నం నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు అదనంగా 10బస్సులు పెంచుతున్నామని, ఇందులో ఆరు బస్సులు ప్రత్యేకంగా మెహిదీపట్నం నుంచి బాలాజీ టెంపుల్‌ వరకు నాన్‌స్టాప్‌ బస్సులను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఆరాంఘర్‌, శివరాంపల్లి, రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో కూడా ఆదివారం ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి బాలాజీ టెంపుల్‌ వరకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్‌ సూర్యనారాయణ తెలిపారు.

Updated Date - 2022-12-31T23:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising