ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News:లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి దృష్టి మరల్చడానికే.. డా.లక్ష్మణ్

ABN, First Publish Date - 2022-08-24T01:19:46+05:30

Hyderabad: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల ఆంక్షలు, అరెస్టు పరిణామాలను బీజేపీ నాయకులు గవర్నర్ తమిళసై (Governer Tamilisi) దృష్టికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: బీజేపీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల ఆంక్షలు, అరెస్టు పరిణామాలను బీజేపీ నాయకులు గవర్నర్ తమిళసై (Governer Tamilisi) దృష్టికి తీసుకెళ్లారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌తో బీజేపీ నేతలు డా.లక్ష్మణ్, విజయశాంతి, రాజగోపాలరెడ్డి, వివేక్, రఘునందన్ రావు, డీకే అరుణ, కొండా సమావేశమయ్యారు. ప్రజా సంగ్రామయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆమెను కోరారు.


ఈ సందర్భంగా డా.లక్ష్మణ్ (Lakshman) మాట్లాడుతూ ..‘కేసీఆర్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. టిఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాదయాత్రపై దాడులు చేయిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకోవడం ద్వారా ఎమ్మెల్సీ కవిత (Kavitha) లిక్కర్ స్కామ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ యాత్రను అడ్డుకోవడం, అరెస్టు చేయడం దిగజారుడు తనానికి నిదర్శనం. టీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి. జరిగిన ఘటనపై విచారణ జరపాలి.’’ అని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-24T01:19:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising