ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodandaram: తెలంగాణతో కేసీఆర్ పేగు బంధం తెగిపోయింది

ABN, First Publish Date - 2022-12-10T14:02:23+05:30

తెలంగాణ రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్.. దేశంలో రైతులకు ఏం చేస్తారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రైతులకు న్యాయం చేయలేని కేసీఆర్.. దేశంలో రైతులకు ఏం చేస్తారని టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం (TJS Chief Kodandaram) విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు బీమా తప్ప రైతులకు మరే సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)లో రూ.30వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం (TRS Government) దగ్గర కొత్త ఆలోచన లదు.. వారి వద్ద ఉన్నది కేవలం నియంతృత్వ, అవినీతి ఆలోచనలే అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరు మార్చారంటే.. తల్లి ఇచ్చిన పేరును వదులుకోవడమే అని అన్నారు. టీఆర్ఎస్ పేరును వదులుకోవటమంటే.. అమరవీరులను అవమానించటమే అని ఆయన తెలిపారు.

ఆంధ్ర ఉద్యోగుల కోసం తెలంగాణ ఉద్యోగులకు డిమోషన్ ఇచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబమంటే ఏంటో లిక్కర్ స్కాంతోనే తేలిపోయిందన్నారు. తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌ (BRS) కు లేదని అన్నారు. తెలంగాణ బచావ్ పేరుతో ఉద్యమకారుల సదస్సులను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. అమరవీరుల బాధ్యత వదులుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ అని విమర్శలు గుప్పించారు. తెలంగాణతో కేసీఆర్ పేగు బంధం తెగిపోయిందని కోదండరాం వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-10T14:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising