ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Modi పర్యటన సందర్భంగా Hyderabadలో బందో ‘మస్త్‌’.. ఆ కాలనీలపై నిఘా

ABN, First Publish Date - 2022-05-26T16:18:06+05:30

ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రధాని పర్యటనకు 1500 మందితో..


హైదరాబాద్‌ సిటీ/బేగంపేట : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నగరానికి రానున్న నేపథ్యంలో పోలీస్‌ ఉన్నతాధికారులు భారీ బందోబస్తును (High Security) ఏర్పాటు చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, ఇంటెలిజెన్స్‌, ఎస్పీజీ సహా 1500 మంది పోలీసులు (Police) బందో బస్తులో పాల్గొంటారు. బేగంపేట (Begumpet) పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు (Traffic) అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.


గ్రీన్‌ల్యాండ్స్‌, ప్రకాశ్‌నగర్‌ టి జంక్షన్‌, రసూల్‌పురా టి. జంక్షన్‌, సీటీవో జంక్షన్‌ల పరిధిలో ప్రధానికి స్వాగతం పలకడానికి వచ్చే అధికారులు, నాయకుల వాహనాలకు (అనుమతి ఉన్నవి) మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వారి వాహనాలను ఎయిర్‌లైన్‌ కాలనీ పార్కింగ్‌ ఏరియా లో పార్కు చేయాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టులోని పార్కింగ్‌ ప్రాంతాన్ని నగర జాయింట్‌ సీపీ కార్తికేయ పరిశీలించారు. ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలతో పాటు విమానాశ్రయం చుట్టు పక్కల బస్తీలు, కాలనీలపై నిఘా పెట్టారు.

Updated Date - 2022-05-26T16:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising