ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad City: ఆలోచనల కలబోత

ABN, First Publish Date - 2022-12-15T10:42:13+05:30

హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన టీఐఈ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్స్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఐఈ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్స్‌ సమ్మిట్‌లో ఆకట్టుకున్న స్టాళ్లు

హైదరాబాద్‌ సిటీ: హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగిన టీఐఈ గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూవర్స్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శకులను ఆలోచింపజేశాయి. స్టార్ట్‌పలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన నిధులను అందించే సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేసి, వారికి అండగా ఉన్నామన్న సందేశాన్నిచ్చాయి.

వీ ఫౌండర్‌

స్టార్ట్‌పలు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సాయంతోపాటు వ్యాపారాభివృద్ధికి ఎండ్‌ టు ఎండ్‌ టెక్‌ వేదిక వీ ఫౌండర్‌ సర్కిల్‌ సహాయ సహకారాలందిస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ సంస్థ ఆరు నెలల వ్యవధిలో 10 స్టార్ట్‌పలకు చేయూత అందించింది. 2021 కల్లా అంతర్జాతీయ స్థాయికి చేరి 37 స్టార్ట్‌పలకు ఫండింగ్‌ అందించి దేశంలోనే రెండో పెద్ద ఏంజెల్‌ ఇన్వెస్టింగ్‌ సంస్థగా ఎదిగింది. 18 నెలల వ్యవధిలో 56 స్టార్టప్‌ సంస్థలకు నిధులను అందించి దేశంలోనే నెంబర్‌ వన్‌ ఏంజెల్‌ ఇన్వెస్టర్‌ సంస్థగా మారింది. సరైన ప్రణాళిక, ఆలోచన ఉన్న యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని వీ ఫౌండర్‌ సర్కిల్‌ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. వ్యాపారవేత్తలు, వీసీ ఫర్మ్‌లు, సిండికేట్‌ సంస్థలు, స్టార్టప్‌ సంస్థల నిర్వాహకులు ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌తో సంప్రదించవచ్చన్నారు.

టిల్లీ యాప్‌

ఏ వ్యాపారానికైనా వినియోగదారుడే కీలకం. వ్యాపార సంస్థలు వినియోగదారుడికి నిత్యం సమాచారం, సందేశాలు పంపుతూ వినియోగదారుడిని ఆకర్షించేందుకు టిల్లీ యాప్‌ను అభివృద్ధి చేశామని టిల్లీ యాప్‌ డిజిటల్‌ ఎనలిస్ట్‌ రషీద్‌ అహ్మద్‌ తెలిపారు. వ్యాపారానికి, వినియోగదారుడికి మధ్య అనుసంధాన కర్తగా టిల్లీ యాప్‌ పనిచేస్తోందని. సేవల రంగంలో స్టార్ట్‌పలకు ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం వారం రోజులపాటు ఉచిత ట్రయల్‌ అందిస్తున్నామని, రూ. 500 నుంచి సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

ఈవీ బ్యాటరీ చార్జర్‌

దేశంలోనే మొదటి స్విచ్‌మోడ్‌ పవర్‌ సప్లై చార్జర్‌లను ఆక్సియం సంస్థ రూపొందిస్తోంది. ప్రస్తుతం ఎలక్ర్టికల్‌ బైక్‌లు, ఆటోలకు ఆఫ్‌బోర్డ్‌, ఆన్‌బోర్డ్‌ చార్జర్‌లను అందుబాటులోకి తెచ్చామని, ఆయా వాహనాల బ్యాటరీ ఓల్టేజ్‌లను బట్టి చార్జర్‌లను తయారు చేస్తామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. తక్కువ విద్యుత్‌ వినియోగంతో త్వరగా చార్జింగ్‌, ఎక్కువ వేడి నుంచి రక్షణ, రివర్స్‌ బ్యాటరీ ప్రొడక్షన్‌, వాహనం గుంతల్లో ప్రయాణించినా రక్షణ కవచం వంటి ఫీచర్లతో ఇవి అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

జంతు ఆహారంగా తడి చెత్త

బ్లాక్‌ సోల్జర్‌ జాతికి చెందిన లార్వాలకు తడి చెత్తను ఆహారంగా అందించడం ద్వారా వాటి నుంచి కొవ్వులు, జంతు ఆహార ఉత్పత్తులు, సహజ ఎరువులను హాలోకేన్‌ సంస్థ తయారు చేస్తోంది. ఈ లార్వాలను ఉత్పత్తి చేసి, విక్రయించడంతోపాటు లార్వాల నుంచి కొన్ని పద్ధతుల్లో నూనె, జంతు ఆహార ఉత్పత్తులు రాగా మిగిలిన వ్యర్థాలు సహజ ఎరువులుగా పనిచేస్తాయి. తడి చెత్త కుళ్లుతున్న సందర్భంలో మీథేన్‌ వాయువు విడుదల అవుతుంది, కానీ లార్వాలకు ఆహారంగా ఇవ్వడం ద్వారా ఎలాంటి విష పదార్థాలు విడుదల కావనీ, లార్వాల నుంచి సేకరించిన ఉత్పత్తులను జంతు ఆహారం తయారీకి వినియోగిస్తామని సంస్థ ప్రతినిఽధి విద్యాధర్‌ బైరెడ్డి తెలిపారు.

లిసెన్‌ యాప్‌

మానసిక సమస్యలకు కౌన్సెలింగ్‌తోపాటు చికిత్సను లిసెన్‌ యాప్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చామని సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. విద్యార్థుఽల్లో మానసిక ఆందోళన ప్రమాదకరమని, వారికి రూ. 50 నామమాత్ర ఫీజుతో సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. మానసిక ఆందోళనలు, ఒత్తిడి సమస్యలకు నిపుణులైన వైద్యులతో కౌన్సెలింగ్‌, చికిత్స అందుబాటులో ఉందని, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా యాప్‌ సాయంతో సేవలను పొందవచ్చన్నారు.

లక్ష్యానికి ప్లాన్‌ బీ ఉండదు..

లక్ష్యానికి ప్లాన్‌ బీ ఉండదు. ఒకవేళ ఉంటే కచ్చితంగా విఫలమవుతాం. సంతోషంగా ఉండాలంటే వేరొకరికి సాయం చేయాలి అంటున్నారు కార్డియాలజిస్ట్‌, సీనియర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ డాక్టర్‌ కిరణ్‌ సి. పటేల్‌. టై గ్లోబల్‌ సదస్సులో భాగంగా ‘సీక్రెట్‌ టు ఎంటర్‌ప్రెన్యూరియల్‌ సక్సెస్‌’ శీర్షికన జరిగిన ఫైర్‌సైడ్‌ చాట్‌లో ఆయన మాట్లాడారు. తమపట్ల నమ్మకం ఉంచుకున్నప్పుడే వ్యాపారవేత్తగా రాణించగలరని ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సూచించారు. 11 యూనికార్న్‌ కంపెనీలు సృష్టించడంలో తన పాత్ర ఉన్నందుకు ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2022-12-15T10:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising