ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సందట్లో సడేమియా అన్నట్లుగా Mahanaduలో జేబుదొంగల చేతివాటం

ABN, First Publish Date - 2022-05-28T17:25:55+05:30

మహానాడులో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సందట్లో సడేమియా అన్నట్లుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు : మహానాడులో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సందట్లో సడేమియా అన్నట్లుగా నందిగామ నుంచి ఇద్దరు, ఒంగోలు నుంచి ఒకరు, తాడేపల్లె నుంచి ఒకరు జేబు దొంగలు ప్రాంగణంలో ప్రజల వద్ద పర్సులు, నగదు అపహరించడం ప్రారంభించారు. నందిగామకు చెందిన ఒక జేబు దొంగ చేతివాటం ప్రదర్శిస్తుండగా ప్రజలు పట్టుకున్నారు. అతనిపై కొందరు చేయిచేసుకుని ప్రాంగణంలో ఉన్న స్థంభానికి కట్టివేశారు. వెంటనే తాలుకా పోలీసులు రంగప్రవేశం చేసి దొంగను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


మధ్యాహ్నానికి పలుచబడిన పోలీసులు..

మహానాడు ప్రాంగణంలోకి వాహనాలు విచ్చలవిడిగా వెళుతున్నా పోలీసులు అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. కారు పాస్‌ లేకపోయినా ప్రాంగణంలోకి వాహనాలు అనుమతించడంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు లోపలే నిలిచిపోయాయి. ప్రజల రాకపోకలకు కాస్త ఇబ్బంది కలిగింది. ఉదయం పదిగంటల వరకు విధులలో కనిపించిన పోలీసులు మధ్యాహ్నానికి బాగా తక్కువ కనిపించారు. పొలీసుల తీరుపై తెలుగు తమ్ముళ్లు అసహనం వ్యక్తంచేశారు. ప్రాంగణంలో మాత్రం పోలీసుల ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

Updated Date - 2022-05-28T17:25:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising