Rythu Bazar: దిగొచ్చిన కూరగాయల ధరలు
ABN, First Publish Date - 2022-12-18T10:38:05+05:30
నగర మార్కెట్లలో కూరగాయల ధరలు దిగివచ్చాయి. పది రోజుల క్రితం కిలో కూరగాయలు రూ.40పైగా
రైతుబజార్‌లో కిలో టమాట రూ.11
హైదరాబాద్ సిటీ: నగర మార్కెట్లలో కూరగాయల ధరలు దిగివచ్చాయి. పది రోజుల క్రితం కిలో కూరగాయలు రూ.40పైగా విక్రయించారు. ప్రస్తుతం వాటి ధరలు మూడింతలు తగ్గాయి. డిసెంబర్ మొదటి వారంలో టమాట, కాకరకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, క్యారట్, ఉల్లిగడ్డ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. రైతుబజార్‌లో కిలో టమాట రూ.15 నుంచి రూ.18 వరకు విక్రయించగా.. సూపర్ మార్కెట్లలో రూ. 25 వరకు అమ్మిన పరిస్థితి. పచ్చిమిర్చి కిలో రూ.50 నుంచి రూ. 60 వరకు విక్రయించారు. అయితే మాండస్ తుపాను ప్రభావంతో టమాట, ఉల్లిగడ్డ పాడైపోవడంతో ఉన్న వాటిని త్వరగా అమ్ముకునేందుకు రైతులు పెద్ద ఎత్తున సరుకును మార్కెట్లకు తరలివస్తున్నారు. దీంతో ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఈనెలాఖర్ వరకు ధరలు సాధారణంగా ఉంటాయని, జనవరి నుంచి మళ్లీ పెరిగే అవకాశం ఉందని సరూర్‌నగర్ రైతు బజార్ మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2022-12-18T10:39:11+05:30 IST