ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఆ లడ్డూ ధర అక్షరాలా..రూ. 45.99లక్షలు

ABN, First Publish Date - 2022-09-11T03:11:33+05:30

Hyderabad: వినాయక చవితిని తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఖైరతాబాద్ గణనాథుడు. తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. ఖైరతాబాద్‌లో ఏటా గణేశుడిని ఒక ప్రత్యేక రూపంలో భారీ స్థాయిలో తయారు చేస్తారు. స్వామిని దర్శించుకోడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Hyderabad: వినాయక చవితిని తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తారు. ఇక హైదరాబాద్‌లో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగినవి ఖైరతాబాద్ గణనాథుడు. రెండోది బాలాపూర్ లడ్డూ వేలం పాట. ఖైరతాబాద్‌లో ఏటా గణేశుడిని ఒక ప్రత్యేక రూపంలో భారీ స్థాయిలో తయారు చేస్తారు. స్వామిని  దర్శించుకోడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. 


చవితి ఉత్సవాల్లో బాలాపూర్‌ లడ్డూ వేలం పాట మరో ప్రత్యేకత. బాలాపూర్‌ లడ్డూ వేలం పాటను 28 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. 1994లో గణేష్‌ చేతిలో లడ్డూను వేలం వేయగా రూ. 450 స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి కొన్నారు. ఆ తర్వాత 1995,1998, 2004, 2008లో మోహన్‌ రెడ్డి లడ్డూ అందుకున్నారు. ఇప్పటివరకూ 27 సార్లు వేలం వేశారు. కరోనా నేపథ్యంలో 2020లో మాత్రం వేలం వేయలేదు. సీఎం కేసీఆర్‌కు బహుమతిగా అందజేశారు. ఈ ఏడాది రూ. 24.60 లక్షల పలికింది. 


బాలాపూర్ లడ్డూ కంటే ఈ లడ్డూ ధర ఇంకా ఎక్కువ..

అయితే అల్వాల్ కానాజిపేట మరకత శ్రీ లక్ష్మి గణపతి లడ్డూవేలం బాలాపూర్ లడ్డూ కంటే ఎక్కువ ధర పలికింది. రికార్డు స్థాయిలో రూ. 45.99లక్షలకు అమ్ముడుపోయింది. గీతప్రియ, వెంకటరావు దంపతులు లడ్డూను సొంతం చేసుకున్నారు.


ఆ సెంటిమెంట్ల వల్లే..

లడ్డూను వేలంలో దక్కించుకున్న వారికి శుభాలు కలుగుతాయనే నమ్మకం ప్రచారంలో ఉంది. బాలాపూర్ లడ్డూ చుట్టు ఎన్నో సెంటిమెంట్లు ఉన్నాయి. లడ్డూను తమ ఇంట్లోకి తీసుకొస్తే.. ఆ ఏడాదంతా లడ్డూ కొన్నవారికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. ప్రసాదాన్ని తమ పొలాల్లో చల్లితే.. పంట బంగారమవుతుందన్న నమ్మకం కూడా ఉంది.  

Updated Date - 2022-09-11T03:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising