ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంకేతికత అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు

ABN, First Publish Date - 2022-12-16T23:50:07+05:30

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ అన్నారు.

ఈడీయూ సమ్మిట్‌లో నవీన్‌ మిట్టల్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 16 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే విద్యార్థులకు దేశంలో అపార అవకాశాలున్నాయని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ అన్నారు. కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో శుక్రవారం సీఐఐ తెలంగాణ ఐదో ఎడిషన్‌ ఈడీయూ సమ్మిట్‌ను ప్లానెట్‌ అండ్‌ పీపుల్స్‌ లైఫ్‌ని మార్చేందుకు ఇన్‌స్పైరింగ్‌ ఇన్సోవేషన్స్‌ అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్‌మిట్టల్‌ మాట్లాడుతూ మానవ మేధస్సును సవాలు చేస్తూ రోబొటిక్స్‌ టెక్నాలజీ వస్తుందన్నారు. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు వర్సిటీలు ముందుండాలన్నారు. పరిశ్రమల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కోర్సులు అందుబాటులోకి రావాలన్నారు. సెయింట్‌ చైర్మన్‌ డా. బీవీఆర్‌ మోహర్‌ రెడ్డి మాట్లాడుతూ విద్యాసంస్థలు విద్యార్థుల్లో క్రిటికల్‌ థింకింగ్‌ స్కిల్స్‌ను ప్రోత్సహించాలన్నారు. ఆవిష్కరణ పరీక్షించేటప్పుడు సంస్థలు, విద్యార్థులు గెలుపు, ఓటములు సమానంగా తీసుకొవాలన్నారు. జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌ పటిష్ఠమవుతుందన్నారు. ఇన్నోవేషన్‌ కల్చర్‌ పాఠశాల స్థాయిలో కాకుండా ఉన్నత విద్యాస్థాయిలో ప్రారంభంకావాలన్నారు. కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొ. మూర్తి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ లింబాద్రి, టీఎన్‌ హరి, ప్రొ. వి.వెంకటరమణ, సి.శేఖర్‌ రెడ్డి, శోభ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising