ప్రేమికుడి దాడిలో గాయపడ్డ యువతి తల్లి మృతి
ABN, First Publish Date - 2022-12-15T03:53:13+05:30
తాను ప్రేమించిన యువతికి త్వరలో నిశ్చితార్థం జరనుందని తెలుసుకుని ఆమె ఇంటికెళ్లి యువతిపై, ఆమె తల్లిపై కత్తితో దాడిచేసి అనంతరం...
మియాపూర్, డిసెంబర్14(ఆంధ్రజ్యోతి): తాను ప్రేమించిన యువతికి త్వరలో నిశ్చితార్థం జరనుందని తెలుసుకుని ఆమె ఇంటికెళ్లి యువతిపై, ఆమె తల్లిపై కత్తితో దాడిచేసి అనంతరం తానూ గొంతుకోసుకున్న సంఘటన మంగళవారం మియాపూర్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తీవ్రంగా గాయపడిన యువతి వైభవ తల్లి శోభ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యువతి వైభవ, సందీ్పకుమార్ చికిత్స పొందుతున్నారు.
Updated Date - 2022-12-15T03:53:14+05:30 IST