congress war: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో బయటపడ్డ జనగామ కాంగ్రెస్ వర్గపోరు
ABN, First Publish Date - 2022-10-17T16:23:51+05:30
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జనగామ కాంగ్రెస్ వర్గపోరు(Janagam congress) బయటపడింది. గాంధీభవన్ (Gandhibhavan) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ నియోజకవర్గం డెలిగేట్ ఓట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ప్రతీ నియోజకవర్గం నుంచి ఇద్దరకి ఓటు వేసే అవకాశం ఉంటుంది. జనగామ నుంచి ఇప్పటికే ఇద్దరికి ఏఐసీసీ (AICC) ఓటింగ్ కార్డ్ ఇష్యూ చేసింది. జనగామ నుంచి పొన్నాలక్ష్మయ్య (Ponnala laxmaiah), చెంచారపు శ్రీనివాస్ రెడ్డి (chemcharapu srinivas reddy)కి ఓటు వేసే అవకాశాన్ని ఏఐసీసీ కల్పించింది. దీంతో పొన్నాల, శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే గాంధీ భవన్ పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. అయితే చివరి క్షణంలో ఓటరు జాబితాలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి పేరును రాష్ట్ర నేతలు తొలగించారు.
ఆయన స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి (Kommuru pratapreddy) పేరును చేర్చారు. గత రాత్రి కొమ్మూరు పేరును చేర్చుతూ రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఓటు వేసేందుకు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి గాంధీభవన్‌కు వచ్చారు. అయితే లాస్ట్ మినిట్‌లో కొమ్మూరి పేరు చేర్చడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్‌లపై పొన్నాల మండిపడ్డారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటు వేసే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పొన్నాలకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) సర్దిచెప్పారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరినీ ఓటు వేయకుండా పీఆర్వో ఆపేశారు.
Updated Date - 2022-10-17T16:23:51+05:30 IST