ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ వస్తున్నారనే.. కేసీఆర్‌ వెళ్తున్నారు: కె.లక్ష్మణ్‌

ABN, First Publish Date - 2022-05-26T12:01:43+05:30

బేగంపేట, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ వస్తున్నారనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర విడిచి పోతున్నారని, ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితీని సీఎం కాలరాశారని బీజేపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బేగంపేట, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ వస్తున్నారనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర విడిచి పోతున్నారని, ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితీని సీఎం కాలరాశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న మోదీని సన్మానించేందుకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో సంబంధిత ఏర్పాట్లను లక్ష్మణ్‌తోపాటు బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్ట పోయిన తెలంగాణ రైతులను ఆదుకోకుండా.. ఇతర రాష్ర్టాల రైతులకు డబ్బులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన రావాలని రాష్ట్ర ప్ర జలు కోరుకుంటున్నారని తెలిపారు. పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 

మోదీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన 

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరగనుంది. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-05-26T12:01:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising