ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజ్ చేసిన ఆర్కే బుక్స్‌ను తిరిగి ఇవ్వాలి: హైకోర్ట్

ABN, First Publish Date - 2022-03-12T16:57:48+05:30

మావోయిస్టు నేత దివంగత ఆర్కే జీవిత చరిత్ర ప్రచురణ, ప్రింటింగ్ ప్రెస్ సీజ్‌పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మావోయిస్టు నేత దివంగత ఆర్కే జీవిత చరిత్ర ప్రచురణ, ప్రింటింగ్ ప్రెస్ సీజ్‌పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది.  పోలీసులు ఆర్కే జీవిత చరిత్రపై ప్రచురణలో ఉన్న బుక్స్‌ను గత నవంబర్‌లో సీజ్ చేశారంటు ఆర్కే సతీమణి శిరీష పిటిషన్ దాఖలు చేశారు. బుక్స్‌ సీజ్‌తో పాటు నవ్య ప్రింటింగ్ ప్రెస్‌ను కూడా పోలీసులు మూసివేశారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వహణలో పోలీసులు నమోదు చేసిన కేసులపై రామకృష్ణా రెడ్డి, సంధ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ప్రచురణలో ఉన్న బుక్స్‌ను ఎలా సీజ్ చేస్తారని పోలీసులను ప్రశ్నించింది. వెంటనే సీజ్ చేసిన బుక్స్‌ను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ప్రింటింగ్ ప్రెస్ కేసులో పోలీసుల తీరుపై హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే రామకృష్ణా రెడ్డి, సంధ్యపై ఉన్న కేసు కొట్టేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-03-12T16:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising