ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందుబాటులోకి స్టీల్‌ బ్రిడ్జి

ABN, First Publish Date - 2022-01-21T15:59:13+05:30

మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పశుసంవర్ధకశాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారుల విస్తరణ తో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌  

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌  


హైదరాబాద్‌ సిటీ: మహానగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. పంజాగుట్ట గ్రేవ్‌యార్డ్‌ వద్ద రూ.17కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన స్టీల్‌బ్రిడ్జిని మంత్రులు తలసాని, మహమూద్‌అలీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం నూతనంగా అండర్‌పా్‌సలు, ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలు, పుట్‌పాత్‌ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల వ్యయంతో కొనసాగుతున్నాయన్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు.


ప్రభుత్వ ప్రత్యేక చొరవతో దేశంలోనే హైదరాబాద్‌ అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. పంజాగుట్ట గ్రేవ్‌యార్డ్‌ వద్ద నూతనంగా నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జితో ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. అంతేకాకుండా నాగార్జున సర్కిల్‌ నుంచి కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా వెళతాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, సీఈ దేవానంద్‌, ఎస్‌ఈ రవీందర్‌, డిప్యూటీ మున్సిపల్‌ కమిషన్‌ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-21T15:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising