ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: కాళేశ్వరం ప్రాజక్టు భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు

ABN, First Publish Date - 2022-07-27T18:37:23+05:30

కాళేశ్వరం ప్రాజక్టు భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ, (Delhi): కాళేశ్వరం ప్రాజక్టు (Kaleswaram project) భూసేకరణ వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పు ఇచ్చింది. యదాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 23న చేపట్టనున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. జస్టిస్‌ ఎఎం ఖన్వీల్కర్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జెబి పర్దివాలా ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఆగస్టు 23 లోపు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని, దానికి పిటిషనర్లు రిజాయిండర్‌ కూడా దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజక్టు పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై బాధితులు 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఆరు పిటిషన్లు కలిపి ఈనెల 22న సుప్రీంకోర్టు ఒకేసారి విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2022-07-27T18:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising