టీవీ చూడొద్దన్నందుకు ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-12-16T23:44:55+05:30
టీవీ చూడొద్దన్నందుకు ఓ యువతి ఆత్యహత్య చేసుకుంది.
నేరేడ్‌మెట్, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): టీవీ చూడొద్దన్నందుకు ఓ యువతి ఆత్యహత్య చేసుకుంది. నేరేడ్‌మెట్ సమతానగర్‌లో నల్లా సుకృత(19) శుక్రవారం ఇంట్లో నిరంతరాయంగా టీవీ చూస్తోంది. టీవీ చూడొద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందింది. తల్లి బయటకు వెళ్లిన సమయంలో తాడుతో ఉరేసుకుంది. బయటి నుంచి ఇంటికి వచ్చిన తల్లి కుమార్తె ఉరేసుకోవడం చూసి నేరేడ్‌మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2022-12-16T23:44:57+05:30 IST