ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాసరావుది ప్రభుత్వ హత్యే

ABN, First Publish Date - 2022-11-24T03:49:23+05:30

గొత్తి కోయల దాడి లో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి(ఎ్‌ఫఆర్వో) శ్రీనివాసరావు హత్యకు గురి కావడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గొత్తి కోయల దాడి లో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి(ఎ్‌ఫఆర్వో) శ్రీనివాసరావు హత్యకు గురి కావడం దారుణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే అటవీ అధికారులు, గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతోందని, ప్రభుత్వం చేతగానితనంతో నిజాయితీపరుడైన ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ‘‘ముమ్మాటికీ ఇది ప్రభుత్వం చేసిన హత్యే. దీనికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలి. శ్రీనివా్‌సరావు కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి’’ అని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల ముందు గిరిజనుల ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీని ఆ తర్వాత అటకెక్కించారని మండిపడ్డారు.

పోడు సమ స్య పరిష్కారానికి మంత్రి సత్యవతీరాథోడ్‌ చైర్‌పర్సన్‌గా కమిటీని ఏర్పాటు చేసి 14 నెలలు గడిచినా ఇంతవరకు అతీగతీ లేదన్నారు.‘‘గుత్తి కోయలు చేసింది ముమ్మాటికి తప్పే. అందుకు వా రిని శిక్షించాల్సిందే. కానీ కేసీఆర్‌ ప్రభు త్వం పోడు భూముల అంశంపై గడిచిన 8 ఏళ్లుగా చూపిస్తున్న నిర్లక్ష్యం క్షమించరానిది’’ అని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. విధులు ని ర్వహిస్తున్న అటవీ అధికారులకు భద్రత కల్పించి.. వారి డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యుద్ధప్రాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మా ర్గదర్శకాలను విడుదల చేయాలని, లేని పక్షం లో కాంగ్రెస్‌ తరపున ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు.

మద్యం మత్తులోనే దాడి: ఆదివాసీ,

అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ

గుత్తికోయలు మద్యం మత్తులో ఫారెస్టు అధికారిపై దాడి చేశారని ఆదివాసీ, అటవీ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ పేర్కొంది. పోడుభూముల్లో నాటిన హరితహారం మొక్కల్లో పశువులను మేపుతున్న తూల అనే గుత్తికోయపై అధికారి చేయి చేసుకున్నారని, అప్పటికే పండుగ చేసుకుని, మద్యం మత్తులో ఉన్న తూల, మంగలు ఎదురుదాడికి దిగారని కమిటీ తెలిపింది. ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాసరావు మరణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేసింది.

Updated Date - 2022-11-24T03:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising