ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ క్రీడాకారులు గర్వకారణం

ABN, First Publish Date - 2022-08-11T06:18:13+05:30

కామన్వెల్త్‌ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు సాధించడం

చైర్మన్‌ అలిపురం వెంకటేశ్వర్‌ రెడ్డిని సన్మానిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు సాయి, జయశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్జల్‌గంజ్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): కామన్వెల్త్‌ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అలిపురం వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం గోషామహల్‌ టీఆర్‌ఎ్‌సవీ సీనియర్‌ నాయకులు నీరుడు సాయికుమార్‌, జయశంకర్‌ ఆధ్వర్యంలో వెంకటేశ్వర్‌ రెడ్డిని గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సాయికుమార్‌, జయశంకర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ల ఆదేశాల మేరకు ఇటీవల ఇంగ్లాండ్‌ బర్మింగ్‌హోమ్‌లో జరిగిన క్రీడల్లో పాల్గొన్న రాష్ట్ర క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు వారి వెన్నంటే ఉండి వారి విజయానికి దోహదపడిన చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్‌, మెట్టు శివ, నాగేందర్‌, మాజీ రంజీ ట్రోపీ క్రీడాకారుడు బి.మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising