Hyderabad: జాల్నా- తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
ABN, First Publish Date - 2022-10-31T10:35:27+05:30
దక్షిణ మధ్య రైల్వే మరఠ్వాడా నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఆదివారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే జెండా ఊపి
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే మరఠ్వాడా నుంచి నేరుగా తిరుపతికి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఆదివారం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దన్వే జెండా ఊపి జాల్నా- తిరుపతి రైలు (07414)ను లాంఛనంగా ప్రారంభించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. జాల్నా నుంచి ఆదివారం ఉదయం 11.50 గంటలకు బయలుదేరే రైలు పర్బణి, పర్లీ, వైద్యనాధ్, బీదర్, కలబుర్గి, గుంతకల్ మీదుగా తిరుపతికి సోమవారం ఉదయం 9.05 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం సా యంత్రం 6.30గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 6గంటలకు జాల్నాకు చేరుకుంటుందని తెలిపారు.
Updated Date - 2022-10-31T10:35:46+05:30 IST